వైఎస్ జగన్ మోహన్ ప్రభుత్వానికి, కోర్టుల్లో మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. పీపీఏల విషయంలో మొదలైన హైకోర్ట్ మొట్టికాయలు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ స్పీడ్ కి, కోర్ట్ బ్రేకులు వేస్తూ ఉండటంతో, జగన్ కు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే శాసనమండలి తన మాట వినటం లేదని, ఆయన శాసనమండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్ట్ ల విషయంలో, ప్రభుత్వాలకు ఎలాంటి అధికారాలు లేకపోవటంతో, కోర్ట్ జోలికి పోలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు విషయానికి వస్తే, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం బ్రాండింగ్ కార్యక్రమం పెట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా, ఎటు చూసినా వైసీపీ రంగులే కనిపించాలి అంటూ, పెద్దలు హుకుం జారీ చెయ్యటంతో, మొత్తం అదే బాట పట్టారు. పంచాయతీ ఆఫీస్లు, ప్రభుత్వం భవనాలు, వాటర్ ట్యాంకులు, ఆకులు, అలమలు, గేదల, గొర్రెల కొమ్ములు, ఇలా ఒకటి కాదు, రెండుకాదు, ఏది కనిపిస్తే అది, వైసీపీ రంగులతో నింపేశారు.

court 27012020 2

ఈ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తతంగం అంతా చూస్తున్న కొంత మందికి విరక్తి చెంది, కోర్ట్ కు వెళ్లారు. ఎక్కడైనా పంచాయతీ ఆఫీస్ అనేది, అన్ని పార్టీల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు వెళ్ళేదిలా ఉండాలని, ఇప్పుడు పంచాయతీ ఆఫీస్లకు వెళ్ళాలి అంటే, ఏదో పార్టీ ఆఫీస్ కు వెళ్లినట్టు ఉందని అంటున్నారు. దీంతో వారికి విరక్తి చెంది, వారు కోర్ట్ కు వెళ్లారు. ప్రజా ఆస్తులకు ఒక పార్టీ రంగులు వెయ్యటం తప్పు అని, కోర్ట్ ఈ విషయంలో, సరైన విధంగా, ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ, గుంటూరుకు చెందిన కొంత మంది హైకోర్ట్ లో కేసు వేసారు. ఈ విషయం పై, ఈ రోజు హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది.

court 27012020 3

పంచాయతీ కార్యాలయాలపై వైకాపా రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా పడింది. అయితే ఇప్పటికి రంగులు వెయ్యటానికి, 1400 కోట్లు అయ్యింది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంటే, ఇప్పుడు ఈ 1400 కోట్లు, మళ్ళీ రంగులు మార్చటానికి, ఎన్ని వేల కోట్లు అవుతాయి. ఇలాంటి వృధా ఖర్చులు పెట్టే బదులు, ప్రజలకు ఉపయోగపడే వాటి పై, ఖర్చు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read