ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో , ఈ రోజు అమరావతిలో అసైన్డ్ భూములు స్కాం అంటూ, ఏపి సిఐడి వేసిన కేసు పై విచారణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటీషన్ పై ఈ రోజు వాదనలు జరిగాయి. దీని పై విచారణ చేసిన హైకోర్టు, ఇరువురి వాదనలు విని, ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వనికి ఝలక్ ఇస్తూ, విచారణ పై నాలుగు వారాలు స్టే విధించింది. సిఐడి విచరణలో ఏమి గుర్తించారు అని చెప్పగా, ఇప్పుడే ఏమి చెప్పలేం అని సిఐడి చెప్పింది. ఇక చంద్రబాబు తరుపున సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ సిద్ధార్ధ లుత్రా వదనాలు వినిపించారు. అదే విధంగా నారాయణ తరుపున, సీనియర్ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ తమ వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరుపున జాస్తి భూషణ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధానంగా, ముఖ్యంగా మూడు అంశాలు చంద్రబాబు వైపు నుంచి వాదించారు. జీవో నెంబర్ 41 అనేది, సీఆర్డీఏ ఆక్ట్ కి అనుబంధంగా తాయారు చేసిందని, ఆ తరువాత ప్రభుత్వం ర్యటిఫై కూడా చేసిందని చెప్తున్నారు. ఇక రెండో అంశం ప్రధానమైనది, ఎవరైతే బాధితులు, రైతులు ఉన్నారో, వారు ఫిర్యాదు చేయకుండా, వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయటం పై కూడా, దీని పై అభ్యంతరాలు లేవనెత్తారు. ఇక మూడో అంశం, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్ అనేవి విశాల ప్రజా ప్రయోజనాల కోసం, రాజధాని కోసం తీసుకున్నామని, వాటికి ఇచ్చే ప్యాకేజి కూడా తాము అప్పట్లో జీవో జారీ చేసామని వాదించారు.

courtu 19032021 1

దీంతో పాటుగా, ఇంకో ప్రధానమైన అంశం, ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఇది ఆక్ట్ లో కూడా ఉందని, అయితే తాము వారికి కూడా లబ్ది చేకూర్చే విధంగా ప్యాకేజి ఇచ్చామని వాదించారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి, ముందుగానే తెలిసి, అసైన్డ్ భూములు మీకు ఎవరికీ ప్యాకేజి ఇవ్వం అని ముందు చెప్పి, వారి వద్ద నుంచి ముందే భూములు కొనుగోలు చేసి, తరువాత జీవో 41 ఇచ్చి, కొన్న వారికి లబ్ది చేకూర్చే విధంగా ఈ ప్రక్రియ సాగిందని, భూములు కొన్నది ప్రభుత్వ పెద్దలు అని వాదించారు. ఇక్కడ కుట్ర జరిగందని, చంద్రబాబుకి, నారాయణకు ఇది తెలిసి చేసారని అన్నారు. ఈ దశలో, కోర్టు కలుగ చేసుకున్న న్యాయమూర్తి, సిఐడి వద్ద స్పష్టమైన ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పాలని, ప్రాధమిక దశలో మీరు ఏమి గుర్తించారని సిఐడిని ప్రశ్నించారు. దీని పై స్పందించిన సిఐడి, ఈ దశలో తాము ఏమి చెప్పలేం అని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తే, అన్ని విషయాలు అప్పుడు తెలుస్తాయి అంటూ కోర్టుకు సమాధానం ఇచ్చారు. దీంతో కోర్టు, నాలుగు వారాల పాటు స్టే విధించింది. పెట్టిన సెక్షన్ లను కూడా, కోర్టు ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read