హైకోర్టునే బురిడీ కొట్టించాలని చూసిన ప్రభుత్వ న్యాయవాదికి, హైకోర్టు ఇచ్చిన రిస్పాన్స్ తో దిమ్మ తిరిగింది. ఉపాధి హామీ బిల్లులు చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో, ఈ రోజు మళ్ళీ విచారణ జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై మండి పడింది. రెండు వారల క్రితం, 494 కేసులలో బిల్లుల చెల్లింపులు చేయాలని చెప్పి, ఆదేశాలు ఇస్తే, కేవలం 25 కేసులలో మాత్రమే చెల్లింపులు చేయటం పట్ల, అలాగే మరో 20 కేసుల్లో పిటీషన్లు వేయటం పై, రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా రెండు వారాల్లో ఈ పేమెంట్ చేయాలని తాము స్పష్టమైన ఆదేశాలు ఇస్తే కూడా, వాటిలో కూడా 20 నుంచి 30 శాతం మినహాయించటం ఏమిటి అంటూ, ఏపి హైకోర్టు నిలదీసింది. ఈ 20 నుంచి 30 శాతం ఎందుకు మినహాయిస్తున్నారు అంటూ, తమకు వివరణ ఇవ్వాలని హైకోర్టు అదేసు ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఈ నెల 15వ తేదీ లోపు, తాము ఆదేశించిన విధంగా, మొత్తం చెల్లించిన పక్షంలో, ప్రతి ఒక్క పిటీషన్ పరిగణలోకి తీసుకుని, ప్రతి పిటీషన్ లో కంటెంప్ట్ అఫ్ కోర్టు కింద కేసులు మొదలు పెడతాం అని చెప్పింది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసి, ఏదో చెప్పబోయి తప్పించుకునే ప్రయత్నం చేసారు.
తాము ఇప్పటికే అన్ని చెల్లింపులు పంచాయతీలకు చేసామని, సర్పంచ్ ఎకౌంటులో వేస్తే, వారు కాంట్రాక్టర్ కు చెల్లించటం లేదని, కోర్టుకు చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఈ వాదాన పై పిటీషనర్ తరుపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. దీంతో కోర్టు కూడా సీరియస్ అయ్యింది. చెల్లింపులు చేయని సర్పంచ్ ల వివరాలు ఇస్తే, వారి పైన కూడా తాము కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేస్తామని, వారి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పటంతో, ప్రభుత్వ న్యాయవాది షాక్ తిన్నారు. ఈ విషయం పై విచారణ చేస్తున్నామని, వారి చెక్ పవర్ రాద్దుక్ హేస్తామని, కోర్టుకు చెప్పే ప్రయట్నం చేసారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, చెక్ పవర్ రద్దు అనేది మీ పని, కానీ తమ ఆదేశాలు పాటించలేదు కాబట్టి, వారి పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతాం అంటూ, వారి పేర్లు ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీంతో ప్రభుత్వ లాయర్ డిఫెన్స్ లో పడింది. రెండున్నర ఏళ్ళ తరువాత కూడా మీరు ఇంకా బిల్లులు ఇవ్వక పొతే వారు ఏమవుతారు అంటూ కోర్టు ప్రశ్నించింది. 15వ తారిఖు వరుకు సమయం ఇస్తూ, అప్పటి లోపు చెల్లింపులు జరగకపోతే, ఇక కోర్టు ధిక్కరణ చర్యలు మొదలు పెడతాం అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.