సీఈసీకి సుప్రీంకోర్టుల ఝలక్ ఇచ్చింది. సీఈసీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అభ్యర్థుల పెండింగ్ క్రిమినల్ కేసుల ప్రకటనలపై.. సీఈసీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అభ్యర్థుల కేసుల గురించి ప్రకటించకపోవడాన్ని.. సుప్రీంకోర్టు తప్పుబట్టింది. టీవీలు, పత్రికల్లో ప్రచురించాలని గతంలోనే ఈసీని ఆదేశించింది సుప్రీం. వారం రోజుల్లో సీఈసీ నుంచి వివరణ కోరిన సుప్రీంకోర్టు. ఇంతవరకు ఎందుకు తమ ఆదేశాలను అమలు చేయలేదని సీఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇంకా అభ్యర్థుల కేసుల గురించి ప్రకటించకపోవడాన్ని తప్పుబట్టింది. టీవీలు, పత్రికల్లో ప్రచురించాలని గతంలో ఈసీకి సూచించింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.
2014 ఎన్నికల్లో నామినేషన్ పత్రాలకు భిన్నంగా 2019 నామినేషన్ పత్రాల్లో ఈసీ కొన్ని కీలకమైన మార్పులు తీసుకువచ్చింది. 2014లో అభ్యర్థులు తమ నేర చరిత్రను నామినేషన్ వేసే సమయంలో ధ్రువీకరిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సిన అసవరం లేదు. ఈసారి ప్రతి అభ్యర్థి తనకు నేర చరిత్ర ఉంటే ఉందని, లేదంటే లేదని పేర్కొంటూ ఒక అఫిడవిట్‌ను నామినేషన్‌తో పాటే రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. పత్రికలు, చానళ్లలో అభ్యర్థితో పాటు ఆయనకు సంబంధించిన పార్టీ ఆ అభ్యర్థికి ఉన్న క్రిమినల్ చరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలి. గత, ప్రస్తుత క్రిమినల్ కేసులను స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా తమ నేర చరిత్రను దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. దేశపౌరులెవరైనా ఆ అభ్యర్థిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు.
ఇక మరో పక్క రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, వార్తా చానళ్లల్లో పెద్దసంఖ్యలో అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల నేర చరిత్ర ప్రకటనలకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నేర చరిత్ర ప్రజల్లో చర్చకు దారితీయనుంది. ఓటెయ్యడానికి ముందే ప్రజలు తమ నేర చరిత్రను తెలుసుకోనుండడంతో.. నేరచరిత గల అభ్యర్థులకు ఎన్నికల ఫలితాలపై ఆందోళన తప్పేలా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే.. ఆ విషయాన్ని అభ్యర్థితో పాటు, ఆ అభ్యర్థికి చెందిన రాజకీయ పార్టీ బహిర్గతం చేయాల్సిందేనని గత సెప్టెంబర్ 25న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఈ ఆదేశాలు పాటించాల్సిందే అని చెప్పటంతో, ఇది మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. జగన్ లాగా 31 కేసుల్లో A1 గా ఉన్నవారి పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరం. జగన్ లిస్టు అంతా ప్రకటనలో రావాలి అంటే, దాదపుగా 30 నిమషాలు పడుతుంది. మరో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆగ్రహం చేసిన వేళ, జగన్ పరిస్థితి ఏంటో చూడాలి.