అమరావతిలో ఏర్పాటు చేసిన తెదేపా రాష్ట్రస్థాయి కార్యశాలలో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎమ్మెల్యేల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, ప్రజలకు సేవ చేసే గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడతాని చెప్పారు. పార్టీ ఉంటేనే మనం ఉంటామని గుర్తుంచుకోవాలని, అహాన్ని వీడకుంటే ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు.
మరో పక్క, టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, వారు చేసిన అభివృద్ధి పనులపై పార్టీ రాష్ట్ర కార్యాలయం ఓ నివేదికను రూపొందించింది. ఎమ్మెల్యే జాతకాల చిట్టా కవర్లను వారికే అందజేసింది. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఎమ్మెల్యేల పనితీరును నివేదికలో పొందుపర్చారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, అంతర్గత విబేధాలు, సర్ధుబాటు చేసుకోవాల్సిన అంశాలపై ఈ రిపోర్టులో సవివరంగా పొందుపర్చారు. మండలాల వారీగా పార్టీ పరిస్థితిపై నివేదికలిచ్చారు. నియోజకవర్గాల్లో పనితీరుపై తమ జాతకాల కవర్లు చూసుకున్న ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు.
నివేదికలో తమ పని తీరును కళ్లకు కట్టినట్టు వివరించారని చెబుతున్నారు. పనితీరు మార్చుకోవాలని కొందరు ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ఎమ్మెల్యేల నివేదికలు చూసిన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల జాతకాలు తన దగ్గర ఉన్నాయని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసే గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడతాని చెప్పారు. పార్టీ ఉంటేనే మనం ఉంటామని గుర్తుంచుకోవాలని, అహాన్ని వీడకుంటే ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు.