సీపీఐ జాతీయ నేత నారాయణ వెలగపూడిలో సైకిల్ పై జాలీగా సవారీ చేశారు... తెల్లవారుజామున సైక్లింగ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కు వెళ్లారు. అక్కడి నుంచి అసెంబ్లీ దగ్గరకు వెళ్లారు... అయితే ఈ టైమ్ లో ఆఫీస్ లో ఎవరూ ఉండరని, అక్కడి సిబ్బంది నారాయణను వెనక్కి పంపారు... దీంతో కాసేపు లాన్ లో కూర్చొని వెనక్కు వచ్చారు నారాయణ... సెక్రటేరియట్ నుంచి వస్తూ వస్తూ ఎన్టీఆర్ క్యాంటిన్ ను పరిశీలించారు నారాయణ... అక్కడ పెట్టే మెనూ గురించి ఆరా తీశారు. అక్కడ్నుంచి మార్గ మధ్యలో కల్లు తాగారు నారాయణ. గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు...
మరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్ బాగానే ఉందని నారాయణ పేర్కొన్నారు. .‘చంద్రబాబు ప్లాన్ అయితే బాగుంది.. రోడ్లు దీర్ఘకాలికంగా ఉండేలా వేస్తున్నారు.. ఆయన ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కాకపోవచ్చు.. ’ అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైకి చిరునవ్వు చిందిస్తూ మొండి చెయ్యి చూపిస్తున్నాడు.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కాపిటల్ నిర్మిచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.. అని ఆయన అన్నారు.
అలాగే మట్టి, నీరు ఇస్తే రాజధాని అయిపోతుందా..? రెండు ఏళ్ళుగా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి.., అమరావతి, పోలవరం నిర్మించాల్సిన భాద్యత కేంద్రానికి ఉంది... అని నారాయణ వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ సత్తా ఏ పాటిదో మొన్న తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి రావడంతో మోడీ మళ్ళీ ఆలోచనలొ పడ్డారు..., మొన్నటి వరకు ఒంటరిగా వెళదామని అనుకున్నారు... ఆర్కే నగర్ దెబ్బతో వెనక్కి తగ్గినట్లు ఉన్నారని నారాయణ అన్నారు. నారాయణతో పాటు, మరో ఇద్దరు సీపీఐ నేతలు సైకిల్ పై అమరావతి రోడ్ల పై హాయిగా తిరిగారు...