ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల రెండుసార్లు చేసిన ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారన్నారు. గత ఐదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తూనే వస్తోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన చట్టం హామీ లను అమలు చేయలేదని, కనీసం కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు ఊసే లేదన్నారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం గురించి మాట్లాడడం లేదని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ పక్కన పెట్టేశారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పదే పదే కేంద్రం చెబుతున్నా ఏపీకి చెందిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరు తెరవడం లేదని రామకృష్ణ అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ అవకాశవాదంతో ఢిల్లీలో జరిగిన విషయాలను బయటపెట్టడం లేదన్నారు.

ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు మధ్య జరిగిన చర్చల సారాం శాన్ని తక్షణం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 17న వామపక్షాల ఆధ్వ ర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాల యాల వద్ద ధర్నాలు చేపట్టనున్నామన్నారు. ఈ ధర్నాల్లో అన్నివర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అయితే రామకృష్ణ ఇంతటితో ఈ విషయాన్ని వదిలి పెట్టలేదు. సమాచార హక్కు చట్టం, ఏపి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి దరఖాస్తు పంపారు. జగన్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని, జగన్ ఏమి విజ్ఞాపనలు ఇచ్చారు, కేంద్రం ఇచ్చిన హామీల వివరాలు తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు.

మరో పక్క కాంగ్రెస్ పార్టీ కూడా, జగన్ ను ఈ విషయంలో విమర్సిస్తుంది. బీజేపీకి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైకాపాయేనని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఏస్ఆర్ సీకి ఓటేసి వచ్చి వైకాపా నాయకులు ఇక్కడ నీతులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఎస్ఆర్టీసీ వ్యతిరేకమని మోడీకి, అమిత్ షాకు జగన్ చెప్పవచ్చు కదా అని ప్రశ్నించారు. బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన కాపలాదారు వైసీపీనే అని రాష్ట్ర ప్రయోజనాలు అనేది ప్రతి ఒక్కరికి ఒక వాడకంగా మారిందని అన్నారు. మండలి రద్దు రాష్ట్ర ప్రయోజనమా అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెప్పినా వారి కాళ్ళు పట్టుకోవడానికి కారణం ఏమిటని శైలజానాథ్ ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read