రాజధాని అమరావతి రైతులు, ఏపి సీఆర్డీఏకు, ఏపీ రేరాకు నిన్న లీగల్ నోటీసులు జారీ చేసారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం నిమిత్తం, భూ సమీకరణ ఒప్పందం ప్రకారం, భూములు తీసుకున్న రైతులకు, సీఆర్డీఏ, భూసమీకరణ ఒప్పందంలో, కొన్ని అంశాలను నిర్దిష్టంగా పేర్కొంది. ఈ భూములను మూడేళ్ళలో తాము అభివ్రుద్ధి చేసి ఇస్తామని, రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నిట్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా ఆ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. 9.14 ప్రకారం, ఈ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి, రైతులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా ఏడేళ్ళు అయినా కూడా ఈ రోజు వరకు కూడా తామకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వక పోవటంతో తాము జీవనోపాధి కోల్పయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తాము మానసిక క్షోభను భరిస్తున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయం చేసుకుని, మూడు పంటలు పండే భూమిని, రాష్ట్ర భావి తరాల భవిష్యత్తు కోసం , ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం, తాము భూములు ఇచ్చామని వారు ఈ సందర్భంగా చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమతో చేసుకున్న భూ సమీకరణలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, వాటిని అభివృద్ధి మాత్రం చేయటం లేదని అన్నారు.

crda 21032022 2

దీంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని చెప్తూ, గజానికి నివాస స్థలానికి 50 రూపాయలు, వాణిజ్య స్థలానికి రూ.75 తమకు నష్ట పరిహారం చెల్లించాలని, ఈ విధంగా తమకు ఎకరానికి మూడు లక్షల వరకు నష్ట పరిహారం చెల్లించాలి, వారు నిన్న ప్రభుత్వానికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపి రేరా ఆక్ట్ అనేది, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం అమలులోకి వచ్చిన సమయంలో, ఏవైతే అసంపూర్తి ప్రాజెక్ట్ లు ఉన్నాయో, అవన్నీ కూడా ఏపి రేరాకు వస్తాయని పలు నిబంధనలలో పేర్కొన్నారని, ఈ విధంగా చూస్తే, సీఆర్డీఏ అనేది భూసమీకరణ చట్టంలో రైతులతో ఒప్పందం చేసుకున్నప్పుడు, ఇది కూడా డెవలప్మెంట్ కు సంబంధించింది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ అసంతృప్తిగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ ని రేరా ఎందుకు టెక్ అప్ చేయలేదని కూడా లీగల్ నోటీసులు జారీ చేసారు. హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్ బాబు, నిన్న రైతుల తరుపున లీగల్ నోటీసులు పంపిస్తూ, ఈ వివాదం పరిష్కరించక పోతే, కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందని, ఆ నోటీసుల్లో తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read