రాష్ట్ర ప్రభుత్వంలో కోల్డ్‌వార్‌ పరాకాష్ఠకు చేరుతోంది. ముఖ్యమంత్రికీ, సీఎస్‌ – ఈసీకి మధ్య ద్విముఖ పోరు తీవ్ర స్థాయికి చేరబోతున్నది. ఎన్నికల సంఘంతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని మొదట నిర్ణయించారు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం వైఖరి, ఎన్నికల సంఘం ఏకపక్ష విధానాలపై అమీతుమీ తేల్చుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. తొలుత ప‌దో తేదీ ఉద‌యం కేబినెట్ స‌మావేశానికి ముహూర్తం నిర్ణ‌యించారు. అయితే, ఎన్నిక‌ల సంఘానికి ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం నుండి అభ్య‌ర్ద‌న వెళ్లినా..ఆమోదం పొంద‌ద‌ని అధికారులు భావించారు. సీఎస్ అడ్డుచెప్ప‌క‌పోవ‌టంతో ముఖ్య‌మంత్రి ఆయ‌న ఆలోచ‌న‌ల‌ను అంచ‌నా వేసి ఏకంగా కేబినెట్ స‌మావేశం వాయిదా వేసారు.

cs 08052019

ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుండి కేబినెట్ నోట్ రావ‌టంతో సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం సీఎం కార్య‌ద‌ర్శి సాయి ప్ర‌సాద్..సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ కార్య‌ద‌ర్శి శ్రీకాంత్‌ను పిలిపించారు. వారితో కేబినెట్ నిర్వ‌హ‌ణ పైన చ‌ర్చించారు. ముందుగా అజెండా ఏంటో స్ప‌ష్టం చేయాల‌ని సీఎస్ కోరారు. అజెండా ఖ‌రారు చేస్తే..దీని పైన ఎన్నిక‌ల సంఘాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వారా అనుమ‌తి కోరుతామ‌ని స్ప‌ష్టం చేసారు. అక్క‌డ ఒక మెలిక పెట్టారు. 10వ‌తేదీన కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించాల‌ని చెబుతున్నారు...ఆ స‌మ‌యానికి ముందుగా అంటే 48 గంట‌ల ముందే ఎన్నిక‌ల సంఘానికి అనుమ‌తి కోసం నివేదించాల్సి ఉంటుంద‌ని సీఎస్ తేల్చి చెప్పారు. దీంతో..సీయం కార్య‌ద‌ర్శి నేరుగా ఈ విష‌యాన్ని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అజెండా విష‌యంతో పాటుగా ఎన్నిక‌ల సంఘం ఆమోదం పొందాలంటే క‌నీసం 48 గంట‌ల ముందుగానే అజెండాన పంపాల్సి ఉంటుంద‌నే విష‌యాన్ని సీఎంకు వివ‌రించారు.

cs 08052019

సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం 48 గంట‌ల ముందు అంటూ ట్విస్ట్ ఇవ్వ‌టంతో వెంట‌నే సీఎం కార్యాల‌యం అప్ర‌మ‌త్తం అయింది. ముఖ్య‌మంత్రితో దీని పైన చ‌ర్చించారు. ప‌ద‌వ తేదీన స‌మావేశం నిర్వ‌హించాలంటే రేపు ఉద‌యం లోగా అజెండా ఖ‌రారు చేసి..ఎన్నిక‌ల సంఘానికి నివేదించాల్సి ఉంది. దీంతో..ఎన్నిక‌ల సంఘం ఎక్క‌డా కేబినెట్ స‌మావేశాన్ని తిర‌స్క‌రించ‌కుండా...భేటీ వాయిదా వేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు కేబినెట్ బేటీని ఈనెల 14వ తేదీకి వాయిదా వేస్తూ...అజెండా తో కూడిన నోట్‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి పంపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతతో పాటు ఎజెండాను రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఉంది. ప్రధాన కార్యదర్శి మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయకపోతే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read