మొన్నా మధ్య జగన్ గారు తిరుపతి వరద ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పీఆర్సి గురించి అడగగా, వారంలో ఇచ్చేస్తాం అన్నా అని అన్నారు. వారం కాస్త నెల రోజులు అయినా పీఆర్సి లేదు ఏమి లేదు. ఉద్యోగులతో చర్చలు అంటూనే, అదిగో ఇదిగో, అప్పుడు రండి, ఇప్పుడు రండి అంటూ కాలయాపన చేస్తూ, ఉద్యోగులతో ఆడుకుంటున్నారు. ఉద్యోగులేమో ఇంకా ఇంకా ఓర్పుగా, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తూనే, బయటకు మాత్రం, గంభీరంగా ఉంటున్నారు. నిన్న మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ సచివాలయం వేదికగా జరిగింది. .ఈ సందర్భంగా కౌన్సిల్ తో సభ్యత్వం ఉన్నటువంటి అన్ని సంఘాల నుంచి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా హాజరు కావటం జరిగింది. మరోసారి ప్రభుత్వం వైపు నుంచి పాత పాటే పాడటం జరిగింది. 14.29% ఫిట్మెంట్ కు అంగీకరించాలని ప్రభుత్వం మరోసారి పతిపాదన ఉంచినప్పటికీ కూడా, దానికి అంగీకరించేది లేదని అధికారుల కమిటీ సిఫారసు ఏదైతే ఉందో, ఆ సిఫారసును తాము ఎట్టి పరిస్తితుల్లో అంగికరించేది లేదు, దానిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నట్లుగా కూడా ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం నిన్న స్పష్టం చేసారు. మరో వైపు కొన్ని ఉద్యోగ సంఘాలైతే అధికారుల కమిటీ కావాలని తప్పు దోవ పట్టిస్తుందని అసహనం వ్యక్తం చేసారు.

employees 23122021 2

మీ వల్ల కాదని, కావాలంటే మమ్ముల్ని జగన్ దగ్గరకు తీసుకు వెళ్ళండి, మేము మాట్లాడి పరిస్థితి తేల్చుకుంటామని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేసాయి. దీంతో చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, ఒక వారంలోపు జగన్ తో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో నిన్నఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు కేవలం 15 నిమషాలు మాత్రమే జరిగిందని ఉద్యోగ సంఘాలు చెప్పారు. చీఫ్ సెక్రటరీ కూడా చాలా ఆలస్యంగా సమావేశానికి వచ్చారని కూడా చెప్పారు. అయితే 15 నిమషాల సమయంలోనే, తమకు 27 శాతం పైన ఎంత ఫిట్ మెంట్ ఇస్తున్నారో చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసారు. మరో వైపు సజ్జల వ్యాఖ్యల పై కూడా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఒకసారి 14.29% అని ఒకసారి 27% అని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థతి గురించి ఆలోచించాలని , ఇలా చెప్పటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకసారి ఆర్ధిక మంత్రితో సమావేశం అయ్యి, మళ్ళీ చీఫ్ జస్టిస్ వద్దకు సమావేశం అని చెప్పటం ఏమిటో అర్ధం కావటం లేదని అన్నారు. మొత్తానికి ఉద్యోగులతో ప్రభుత్వం అయితే ఒక ఆట ఆడుకుంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read