ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ ల మధ్య చిచ్చు రేగింది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు అంటూ, సీఎం ముఖ్య కార్యదర్శి, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇచ్చిన ఉత్తర్వులు పై, కాక రేగిన వేళ , ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, ప్రవీణ్‌ ప్రకాశ్‌ కు షోకాజ్ నోటీస్ ఇచ్చి, సమాధనం చెప్పాలి అనటం సంచలనంగా మారింది. తన పరిధులు దాటి, ప్రవర్తించారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రవీణ్ ప్రకాష్ కు, షోకాజ్ నోటీస్ జారీ చేసారు. అయితే ఈ పరిణామం పై, ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కావాలనే ఎల్వీ సుబ్రమణ్యంను టార్గెట్ చేస్తున్నారా అనే అభిప్రాయం కొంత మందిలో వ్యక్తం అవుతుంది. ఈ నేపధంలోనే, ఏకంగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి, చీఫ్ సెక్రటరీ షోకాజ్ నోటీస్ ఇవ్వటం అంటే, మామూలు విషయం కాదు. దేశ చరిత్రలోనే బహుసా ఇది మొదటి సారి ఏమో అని, ఐఏఎస్ వర్గాలు అనుకుంటున్నాయి.

lvs 03112019 2

మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో, ఒక అజెండా ఐటెంను, చీఫ్ సెక్రటరీ అనుమతి లేకుండా, ప్రవీణ్ ప్రకాష్ డైరెక్ట్ గా పెట్టరు అని, ఇది నిబంధనలకు, బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకం అని చెప్తూ, ఒక వారం రోజుల్లో దీని పై సంజయషీ ఇవ్వాలని, చీఫ్ సెక్రటరీ, ప్రవీణ్ ప్రకాష్ ను ఆదేశించారు. అయితే దీని కంటే వారం రోజుల ముందు, గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా, చీఫ్ సెక్రటరీకి కూడా చెప్పకుండా, రాత్రికి రాత్రి, బిజినెస్‌ రూల్స్‌ను సవరిస్తూ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు ఇవ్వటం కూడా పెను సంచలనంగా మారింది. ఎవరూ నాకు అతీతం కాదు, నేను సీఎం ముఖ్య కార్యదర్శిని అనే విధంగా, ప్రవీణ్ దూకుడుగా వెళ్తున్నారని ఐఏఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్పెషల్‌ సీఎస్‌ స్థాయి అధికారులకు సైతం, నోటీసులు ఇచ్చే అధికారాన్ని, ఈ బిజినెస్ రూల్స్ మార్చటం ద్వారా, ప్రవీణ్ ప్రకాష్ చేసారు.

lvs 03112019 3

చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం కూడా, ప్రవీణ్ విడుదల చేసిన ఈ జీవో పట్ల తన సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన అధికార పరిధిని ప్రవీణ్‌ ప్రకాశ్‌ టెక్ ఓవర్ యడం నిబంధనలకు విరుద్ధమన్నది ఆయన వాదన. అయితే ప్రవీణ్ ప్రకాష్, జగన్ కార్యాలయంలో పని చేస్తూ ఉండటంతో, ఆయన పై చర్యలు తీసుకునే విషయం పై, ఆచి తూచి స్పందిస్తున్నారు. అయితే ప్రవీణ్ చర్యలు ఇంతటితో ఆగకుండా, ఉప కార్యదర్శుల బదిలీలను తానే చేస్తానంటూ జారీ చేసిన జీవోపైనా, చీఫ్ సెక్రటరీకి కోపం వచ్చిందని, తరువాత క్య్బినేట్ లో ఒక అజెండా చేర్చే విషయం పై కూడా, తన అనుమతి తీసుకోలేదని, వ్యవహారం శ్రుతి మించుతూ ఉండటంతో, ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు జలక్‌ ఇస్తూ నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read