రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య, మరో వివాదం తెర మీదకు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ ఈ మేరకు, కేంద్రానికి లేఖ రాసారు. పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్, ద్వివేది, గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన, ప్రొసీడింగ్స్‌ను వెనక్కి పంపాలని చీఫ్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాసారు. ఈ మేరకు, కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ కార్యదర్శికి, ఆదిత్యనాద్ దాస్ లేఖ రాసారు. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల పై, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అవమానకర రీతిలో ఫిర్యాదు చేసిందని లేఖలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరించాలేదని, , ద్వివేది, గిరిజా శంకర్‌పై, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సెన్సూర్‌ ప్రోసీడింగ్స్ ఇచ్చారని, లేఖలో వివరించారు. అయితే సెన్సూర్‌ ప్రోసీడింగ్స్ ఇచ్చే సమయంలో, ఇద్దరు ఐఏఎస్ అధికారుల నుంచి వివరణ తీసుకోవాల్సి ఉండగా, ఇద్దరి దగ్గర నుంచి వివరణ తీసుకోలేదని తెలిపారు. వివరణ కోరకుండా, సెన్సూర్‌ ప్రోసీడింగ్స్ ఎలా ఇస్తారాని లేఖలో ప్రస్తావించారు. వారిని వివరణ కోరకుండా సెన్సూర్‌ ప్రోసీడింగ్స్ ని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఇవ్వటం, ప్రభుత్వం యొక్క అధికార పరిధి అతిక్రమించటమే అని ఆయన తెలిపారు.

cs 28012021 2

కేంద్రం పరిధిలో ఉన్న అధికారుల పై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదని, ఆ లేఖలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోలోని అధికారులను, ఐఏఎస్ అధికారుల పై చూపించారని, కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధం అని తెలిపుతూ, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అభిశంసన ఉత్తర్వులను వెనక్కు పంపించందని కేంద్రానికి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంపిన అభిశంసన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోవద్దని, కేంద్రాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తగిన సూచనలు ఇచ్చి, దిశా నిర్దేశం చేయాలని, కేంద్రానికి లేఖ రాసారు. మరి ఈ అంశం పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఓటర్ల జాబితా రెడీ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పినా, ద్వివేది, గిరిజా శంకర్‌ ఎన్నికల జాబితా రెడీ చేయలేదని, దీని వల్ల 2019 ఎన్నికల జాబితా వాడాల్సి వస్తుందని, దీని వల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, అందుకే దీనికి బాధ్యులని చేస్తూ ఇద్దరి అధికారుల పై , ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read