ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ అధికారులు విచిత్ర ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యంగా APEPDCL గత రాత్రి జారీ చేసిన ఆదేశాలు చూసి షాక్ తిన్నారు. ప్రతి నెల చివరి వారంలో మీటర్ రీడర్లు వెళ్లి, విద్యుత్ ఎంత కాల్చారు, ఎంత బిల్లింగ్ అయ్యింది అనేది తీసి, స్పాట్ బిల్లింగ్ రూపంలో, రీడింగ్ తీసి, వెంటనే కరెంటు బిల్లు తీసి వెళ్తారు. అయితే ఈ నెలలో మాత్రం విచిత్ర ఆదేశాలు వచ్చాయి. రీడింగ్ తీయండి కానీ, బిల్లు ఎంత వచ్చిందో చెప్పొద్దు అని విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు ఎంత పెరిగాయో అర్ధం అవ్వాలి అంటే, బిల్లు ఇస్తేనే తెలిసేది. ఈ నెలలో బిల్లు ఎంత, గత నెలలో బిల్లు ఎంత వచ్చింది, ఎంత పెరిగింది అనేది ప్రజలు పోల్చి చూసుకుంటారని, ఎంత ఎక్కువ పెరిగింది అనేది తెలిసిపోతుంది కాబట్టి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, విద్యుత్ శాఖ అధికారులు, ఇటువంటి విచిత్ర ఆదేశాలు జారీ చేసారు. రీడింగ్ తీస్తాం , బిల్లులు ఇవ్వం, SMS రూపంలో మీరు ఎంత కట్టాలో పంపిస్తాం అని చెప్తున్నారు. SMSలో సంక్షిప్త సందేశం ఉంటుంది, అంటే అందులో బిల్లు మాత్రమే ఉంటుంది. రీడింగ్ తీసేసి బిల్లు ఇస్తే, ప్రజలు ఎంత పెరిగాయో చుసుకోలేరని, ఈ విధంగా ప్రజల ఆగ్రహం తగ్గించుకోవచ్చని చూస్తున్నారు.
అయితే ప్రజలు మాత్రం, ఈ విచిత్ర ఆదేశాలు చూసి షాక్ తిన్నారు. పోయిన నెల ఎండలు విపరీతంగా పెరిగిపోవటంతో, సహజంగా ఎక్కువ సేపు విద్యుత్ వాడి ఉంటారు. ఈ నెల బిల్లు మామూలుగా ఎక్కువ వస్తుందని, అయితే ఇప్పుడు పెరిగిన విద్యుత్ చార్జీలతో, మరింత పెరిగే అవకాసం ఉందని, ఎంత పెరిగిందో తాము చూడకుండా, విద్యుత్ అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని, ప్రజలు వాపోతున్నారు. SMSలు ఇస్తే తమకు అర్ధం కాదని, నేరుగా బిల్లు ఇవ్వాలని, ఎక్కువ మంది వినియోగదారులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం సాఫ్ట్ వేర్ రెడీ అవ్వలేదని, అందుకే ఇలా చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ప్రజల నుంచి ఇంత వ్యతిరేక వస్తుంటే, అధికారులు ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి. మరో పక్క విద్యుత్ చార్జీలు ఇలా ఉంటే, రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలు ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా, 6 గంటలకు తక్కువగా కరెంటు తీయటం లేదు. ఒక పక్క చార్జీల బాదుడు, మరో పక్క విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.