సాంకేతిక బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో, సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యలో నేరాలను అరికట్టడానికి విశాఖలో సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు రూ.కోటి కేటాయిస్తూ శాశ్వత భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

నూతన భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ కు ప్రభుత్వం సూచించింది. దీంతో ఆయన వుడా కాంప్లెక్స్ లోని రెండో అంతస్తులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని వుడా విసికి లేఖ రాశారు. స్థలం కేటాయిస్తే మరో నెల రోజుల్లో సైబర్ ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం చేస్తామన్నారు.

దీంతో రాష్ట్రంలోనే తొలి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ విశాఖలో ఏర్పాటు కానుంది. సైబర్ కేసుల్లో నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, సాఫ్ట్ వేర్ కలిగిన ల్యాబ్ నగర పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ల్యాబ్ లేకపోవడంతో హైదరాబాద్లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాల్సి వస్తోంది. ఫలితంగా తీవ్రమైన కాలయాపన చోటుచేసుకోవడం, కేసు విచారణ సమయంలో అవసరమైన ఆధారాలను సమర్పించ లేకపోవడంతో నిందితులు తప్పించుకుంటున్నారు.

వుడా కాంప్లెక్స్ లో అనుమతి వచ్చిన వెంటనే, సీ-డాక్ సంస్థకు చెందిన నిపుణులు అక్కడకు చేరుకుని ల్యాబ్ పరికరాలను అమర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత సైబర్ ల్యాబ్ నిర్వహణ పై పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. ల్యాబ్ అందుబాటులోకి వస్తే బాధితులకు ఎక్కడి నుంచి మెయిల్స్ వచ్చాయి. వారెక్కడ నుంచి ఆపరేట్ చేశారు. ఐపీ నంబరు ఆధారంగా వాళ్లు ఏ కంప్యూటర్, ఏ ల్యాప్టాప్ వాడారు? అనే విషయాలు సులభంగా తెలిసిపోవడంతో కేసు చేధించడం మరింత సులువయ్యే అవకాశముంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read