విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో, రాజధానిలో తొలి సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు, దాదాపు కొలిక్కి వచ్చాయి. మరో వారో పది రోజుల్లో, ఇక్కడ నుంచి సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం కానుంది. గతేడాది సైబర్‌ నేరాలు పెరిగిన నేపధ్యంలో వీలైనంత త్వరగా స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్‌ కమిషనరేట్‌ వర్గాలు చెబుతున్నాయి.ఈ సైబర్‌ విభాగం ప్రత్యేకంగా ఓ డిసిపి పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మెళకువలు నేర్చుకున్న 30 మంది సిబ్బందిని కేటాయించనున్నారు. ఇటీవల కాలంలో కమిషనరేట్‌ పరిధిలో కంప్యూటర్‌ నాలెడ్జిపై అవగాహన ఉన్న యువకులకు ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు.

cyber 09072018 2

గతంలో పోలీస్‌ కమిషనరేట్‌లో సైబర్‌ నేరాల కేసులు సామమాత్రంగా నమోదయ్యేవి. విజయవాడ రాజధాని నేపధ్యంలో సైబర్‌ నేరాల సంఖ్య పెరిగింది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్‌తోపాటు బ్యాంకింగ్‌ నేరాలు, ఇంటర్‌ వాయిస్‌ కాల్‌ డైవర్షన్‌ లాంటి కేసులు నమోదయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంచుకుని ఖాతాదారులను ఆకర్షించి వారి దృష్టిని మరల్చడం ద్వారా ప్రస్తుత వ్యవస్థలో ఆన్‌లైన్‌ సైబర్‌ నేరాలు, బ్యాంక్‌ల పేరుతో ఆర్థికపరమైన మోసాలు పెరిగాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఒటిపి పేరుతో మోసాలు జరుగుతున్నాయి. మరో పక్క సోషల్ మీడియా వాడకం ఎక్కవు కావటంతో, ఇక్కడ కూడా వేధింపులు, మోసాలు ఎక్కువ అయ్యాయి. ఈనేపథ్యంలో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనం నిర్మించారు.

cyber 09072018 3

సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభమైతే.. కేసులను ఇక్కడే నమోదు చేసి, విచారణ జరిపే అవకాశం కలుగుతుంది. ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. సిబ్బందిలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని గుర్తించి ఇందులోకి తీసుకున్నారు. నేర పరిశోధనలో సాంకేతిక సాయం కోసం ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. అవసరమైన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకున్నారు. సిబ్బందిని అన్ని విధాలా సుశిక్షుతులుగా మార్చేందుకు నగర పోలీసులు ఇప్పటికే ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్స్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సైబర్‌ పరిజ్ఞానం, పరిశోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కంప్యూటర్ లు, మొబైల్‌ ఫోన్లు, మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని తొలగించినా, అధునాతన పరికరాల సాయంతో పోలీసులు రాబడతారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read