దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకునేది అభివృద్ధి... ఒకడు దెబ్బ కొట్టి రోడ్డున పడేసాడు... ఇంకొకడు వచ్చి, అదే దెబ్బ మీద మళ్ళీ కొట్టాడు... వీళ్ళ దెబ్బలు తట్టుకుని, నిలబడి పోరాడుతుంది, ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్... మా మీదే ఎదురు తిరుగుతారా, మీ పై ఆపరేషన్ గరుడ అంటూ వస్తున్నాం, మీ మనుషుల చేతే మిమ్మల్ని దెబ్బ కొడతాం... మీలో కులాల బలహీనతను ఆసరాగా తీసుకుని, మీ మధ్యే గొడవలు పెడతాం అంటూ, ఒక బ్యాచ్ తయారయ్యింది.. రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తాం... కులాల మధ్య గొడవలు పెట్టి, రాష్ట్రంలో అనిశ్చితి నెలకోల్పుతాం అంటూ రెచ్చిపోతున్న ఆపరేషన్ గరుడ బ్యాచ్ కి, నిన్న దాచేపల్లి సంఘటన ఒక చెంప పెట్టు...
9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. అతను రెండు రోజుల పాటు పరారీలో ఉన్నాడు. మరో పక్క, ఇటు రెండు మతాల మధ్య గొడవగా మారే పరిస్థతి వచ్చింది.. ఒక వైపు ముస్లింలు ఆందోళన... ఇదే అదనుగా చూసుకుని, కొంత మంది అక్కడ గొడవలు రేపటానికి ప్రయత్నించారు.. కాని, అక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఎక్కడా బ్యాలన్సు తప్ప లేదు.. మాకు న్యాయం జరగాలి, ఆ రేపిస్ట్ ను అరెస్ట్ చెయ్యాలి, శిక్ష వెయ్యాలి అని ఆందోళన చేసారు కాని, ఎక్కడా లైన్ దాటలేదు... ఆందోళన చేస్తూనే, పోలీసులకి సహకరించారు.. కొంత మంది, అన్ని విధాలుగా, అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసారు..
కొంత మంది, సుబ్బయ్య మా చేతుల్లో చావలేదు, సుబ్బయ్య కొడుకును కూడా ఉరితీయాలి అంటూ ఆందోళన చేసారు. సుబ్బయ్య తప్పుచేస్తే అతని కొడుకును ఉరితీయాలని చెప్పడం మరింత విచిత్రంగా ఉందని, పోలీసులు అలెర్ట్ అయ్యారు. అక్కడ ఉన్న కొంత మంది పెద్దలకు నచ్చ చెప్పి, పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మరో వైపు, సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని, నడిరోడ్డుపై సుబ్బయ్య మృతదేహాన్ని తగలబెట్టాలన, హోం మంత్రి కాన్వాయ్ అడ్డుకున్నారు... ఇక్కడ కూడా పోలీసులు వెనక్కు తగ్గారు. ఆందోళనకారులను ఏమి అనవద్దని హోం మంత్రి ఆదేశాలివ్వడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. పోలీసులు, ప్రభుత్వం, ఉద్రిక్తతను తగ్గించారు. అక్కడ కొంత మంది, ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా, అక్కడ ప్రజలు ఎక్కడా విధ్వంసం చెయ్యలేదు.. కేవలం ఆ రేపిస్ట్ ను శిక్షించాలి అనే డిమాండ్ మాత్రమే చేసారు.. అదే ఇంకొక రాష్ట్రంలో అయితే, ఇలాంటి ఘటనలు రెండు మతాల మధ్య గొడవకు దారి తీసేది.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞత.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోకి తెచ్చిన వైనం... ఆపరేషన్ గరుడ బ్యాచ్, ఇక రెలాక్స్ అవ్వండి.. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలకు ఆంధ్రపదేశ్ ప్రజలు సిద్దంగా లేరు...