అత్యంత అమానుషంగా, ఒక చిన్న పిల్ల పై, పశువుగా ప్రవర్తించిన ఆ ఉన్మాదుడు చచ్చాడు.. ఈ సందర్భంలో, నిన్న దాచేపల్లి బాధితురాలి బంధువులు, చంద్రబాబుని వచ్చి కలిసారు... ఈ ఘటన జరిగిన వెంటనే, ఉన్నావో, కథువా ఘటనలు గుర్తొచ్చాయని, న్యాయం జరుగుతుందో లేదో అనుకున్నామని, కాని ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తూ, నమ్మకం కలిగిందని చెప్పారు. ఘటన జరిగిన విషయం తెలుసుకుని, ఎమ్మల్యే యరపతనేని శ్రీనివాస్ గారు, సొంత వాహనంలో హాస్పిటల్ కు పంపించారని, తరువాత పోలీసుల దర్యాప్తు, మీరు చూపించిన చొరవ, రెండు రోజుల నుంచి చూసామని, అప్పుడు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం మాకు కలిగిందని, చెప్పారు.. అనుకునట్టుగానే, న్యాయం జరిగిందని చెప్పారు.
ఈ ఘటన తమకు తెలియగానే ముందు కేసు పెట్టాలా? వద్దా? అనే విషయంపై ఆలోచించామని, చివరకు న్యాయం కోసం కేసు పెట్టామని తెలిపాడు. నిందితుడు రామసుబ్బయ్యకు భగవంతుడే మరణశిక్ష విధించాడని మైనర్ బాలిక సమీప బంధువులు అభిప్రాయపడ్డారు. తమతోపాటు ప్రజలంతా కోరుకున్నట్లుగానే సుబ్బయ్య కథ ముగిసిందని పేర్కొన్నారు. ఇది భగవంతుడు వేసిన శిక్షగా తాము భావిస్తున్నామని చెప్పారు. ‘‘ప్రభుత్వం రూ.5 లక్షలు సహాయం ప్రకటించింది. ఎమ్మెల్యే యరపతినేని రూ.2 లక్షలు సహాయం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వైద్యులతో మాట్లాడి మంచి వైద్యం అందేలా చూశారు. సొంత ఇల్లులేని బాధిత కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని.. తానే భూమి పూజ చేస్తానని ఆయన హామీ ఇవ్వడం సంతోషకరం’’ అని బాలిక బంధువులు, అంజుమన్ కమిటీ కార్యదర్శి చిన్న గాలిషా అన్నారు.
అత్యాచార ఘటనలకు పాల్పడినవారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, గల్ఫ్‌లో మాదిరిగా ఉరితీయాలని దాచేపల్లి బాలిక చిన్నాన్న ముఖ్యమంత్రిని కోరారు. ఒంటరిగా ఉన్న బాలికను మీ అమ్మమ్మ ఇంటికి తీసుకెళతానని నమ్మించి సుబ్బయ్య తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు. కథువా, ఉన్నావ్ ఘటనల్లో బాధితులకు జరగని న్యాయం, తమకు జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలందించిందని ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, ఈ రోజు చంద్రబాబు, హాస్పిటల్ కు వెళ్లి ఆ బాలికను కలిసి, ధైర్యం చెప్పనున్నారు.