ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ, ఒక్కో స్లీపర్ సెల్ బయటకు వస్తుంది.. ఎన్నికల వేళ మాత్రమే బయటకు వచ్చి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ లో ప్రముఖుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పురంధేశ్వరి గారి భర్త. కరుడుగట్టిన చంద్రబాబు వ్యతిరేకి అయిన , దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం, చంద్రబాబు రోజు రోజుకీ బలపడుతూ ఉండటంతో, నిద్రావస్థలో ఉన్న ఈయన కూడా బయటకు వచ్చారు. ఇప్పటికే ముద్రగడ, మోత్కుపల్లి, లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, పవన్, జగన్, అందరూ కలిసి, చంద్రబాబు పై ఎలా ఎగబడుతున్నారో చూస్తున్నాం. వీరికి తోడుగా, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రంగంలోకి దిగారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ గరుడ బ్యాచ్ మాట్లాడిన మాటలే మాట్లాడారు.

daggubati 23072018 2

వైఎస్‌ జగన్‌ ఉచ్చులో సీఎం చంద్రబాబు పడ్డారని అన్నారు. చంద్రబాబు ఎన్నికల కోసం యూటర్న్‌ తీసుకున్నాయని తెలిపారు. అవిశ్వాసం పెట్టడం కేవలం పత్రికల్లో హెడ్‌లైన్స్‌ రాసుకోవడానికే పనికొచ్చిందని వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీని వ్యతిరేకించాలనే ఓట్ల రాజకీయం మాత్రమే సాగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆవేదనతో ప్రజలకు ఏదైనా చెప్పాలని బయటకు వచ్చానన్నారు. ఏడు ముంపు మండలాలను కేంద్రం ఏపీలో కలిపినా వివక్ష చూపిస్తోందంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దుగరాజపట్నం పోర్టు, స్టీల్‌ ప్లాంట్‌పై అన్ని నివేదికలు సమర్పించి.. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అడిగి సాధించుకోవాలని సూచించారు.

daggubati 23072018 3

హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం సరికాదన్నారు. హోదా ఇవ్వకపోయినా మంచి ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, ఎస్పీవీ ఏర్పాటుచేసుకుంటే రాయితీలు, ప్రోత్సాహకాలు త్వరగా వచ్చే వీలుంటుందని తెలిపారు. అయినా రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నాక హోదాపై మోజెందుకని ఎద్దేవాచేశారు. పరిపాలన అంటే ప్రెస్‌మీట్‌లు పెట్టడం, దీక్షలు చేయడం కాదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హామీలు నెరవేర్చనని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. మొత్తానికి, టార్గెట్ చంద్రబాబుగా, వారినికి ఒక ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టనున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read