దగ్గుబాటి వెంకటేశ్వరరావు...భార్య బీజేపీలో, ఈయన వైసిపీలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈయనగారు, రేపు జగన్ సమక్షంలో వైసిపీ లో చేరుతున్నారు. జగన్ ని సంతోషపెట్టటానికొ, విజయసాయి రెడ్డిని ఆనందపరచటానికో కాని, ఈ రోజు తప్పుడు భాష మాట్లాడుతూ, "నా తోడల్లుడు వింత జాతికి చెందిన వ్యక్తి" అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేసారు. ఇదే సందర్భంలో, ఇన్నాళ్ళు దగ్గుబాటిని అభిమానించిన అభిమానులు, జగన్ పార్టీలో ఆయన చేరటం జీర్ణించుకోలేక ఉత్తరం రాసారు. "గౌరవనీయులైన దగ్గభాటి వెంకటేశ్వరరావు గారికి , . . అయ్యా మీ తోడల్లుడుగారైనా చంద్రబాబు గారికి ఇంగ్లీష్ రాకపోయినా ఆయన గారి పనితనాన్ని ప్రపంచమే మెచ్చింది. సోషల్ మీడియాలో చంద్రబాబు గారి ఒక్కరినే తిట్టరండి మీరు చేరతున్న దొంగలపార్టీ నాయకుడిని , మిమ్మలని తిడుతున్నారు , మిమ్మలని తిడుతుంటే మా ఇంటి మనిషి ని తిట్టినట్లు మేము ఫీలయ్యాము , మేము ఫీలవుతున్నామని మీరు ఖైదీనంబర్ 6093 పార్టీలో చేరకుండా ఉన్నారా లేదే తిట్లు కామన్ అని తిరిగి అదే పార్టీలో చేరుతున్నారు, అలాంటి మీరు ఇలా మాట్లాడటం అసలు భాగా లేదు సర్"
"మీరు చెప్పినట్లు కలెక్టర్లు నవ్వుకోనుండవచ్చు , మీరు చెప్పేవన్ని ప్రభుత్వంలో కోన్ని నిజాలుండవచ్చు , మాయావతి , అఖిలేశ్ నవ్వుకోని ఉండవచ్చు తప్పులేదు . . . . అలా నవ్వితే వాళ్ళ పళ్ళే భయటపడుతాయి . . . మీకు , నాకు వచ్చిన భాద ఏముంది సర్ , ప్రభుత్వలోపాలను చక్కగా చెప్పి మంచి ప్రతిపక్ష పాత్రని హూందాగా పోషించఉండవచ్చు అలా చేయకుండా రాజకీయాలకు స్వస్తి అని చెప్పి మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టటం అనేది మీ విశ్వసనీయత మీద అనుమానం గా ఉంది సర్. చంద్రబాబు గారు మీ కోత్త నాయకుని వలే వ్యవస్ధలను లూటీ చేయలేదు . . . మీ స్దాయికి మీరు ఆ 420 నాయకత్వం లో పనిచేయటం అనేది మాకు ఆత్మహత్య సదృశ్యం సర్ మీకు కాదు ఎందుకంటే మీరు అభిమానుల అభిప్రాయాలను ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు , నిర్ణయం తీసుకోని అప్పుడు అభిమానులను అభిప్రాయాలడుగుతారు . . . అప్పుడేమంటారు పిచ్చి జనాలు అయిష్టంగా తలలూపుతారు ఎక్కడ మీరు నోచ్చుకుంటారోనని . . ."
"కాని ఈ సారి అలా కాదు సార్ మీ సెంటిమెంట్ రాజకీయాలకు తెరపడినట్లే మీరు భారీ మెజార్టీతో ఓడిపోబోతున్నారు ఎందుకంటే విలువలు , విశ్వసనియత కి కేరాఫ్ అడ్రస్ మచ్చ లేని మా నాయకుడు అని చెప్పుకునే మా నాయకుడు పప్పులో కాదు సార్ తప్పులో కాలేసారని చాలా భాదపడుతున్నారు , భాద కాదు సరిగ్గా చెప్పాలంటే ఆగ్రహంతో ఉన్నారు . . .చెంచురామ్ గారిని తెలుగుదేశం నుంచి పోటీ చేపిద్దామనుకున్నారు అప్పుడు ఇప్పుడు మీరు చెప్పే బాబు గారి లోపాలు కప్పిపుచ్చేవారా సర్ చేరినట్లైతే. రోజకు పద్దేనిమిది గంటలు కష్టపడి పనిచేసే నాయకుడిని మీరు సమర్ధించకపోయినా పరవాలేదు గజదోంగ పంచన చేరి రాష్ట్ర భవిష్యత్త్ ని ఏమి చేద్దామనుకుంటున్నారు , దీనిని బట్టి మీ భాద్యతను శంకించవలసోస్తుంది.సార్ చివరగా ఒక్క మాట మీకు మీకు ఎన్నైనా ఉండవచ్చు , బాబు గారి పాలనలో అన్ని సరిగ్గా ఉన్నాయని చెప్పము కోన్ని లోపాలుండవచ్చు అంతమాత్రానా దోంగల చేతికి అధికారం అప్పగించాలని మీరు చేస్తున్న రాజకీయం మీరు జీవితంలో చేస్తున్న పెద్దచారిత్రాత్మక తప్పిదం . . . చంద్రబాబు గారి నాయకత్వాన్నే ఆంద్రప్రదేశ్ కోరుకుంటున్నది ఇది నిజం ఇదే నిజం" అంటూ దగ్గుబాటి అభిమాని ఉత్తరం రాసారు.