ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ప్రత్యెక స్థానం ఉండనే చెప్పాలి. అయితే ఆయన 2014 ఎన్నికల నాటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన భార్య పురంధేశ్వరి మాత్రం, బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇద ఇలా ఉంటే గత కొంతకాలం నుంచి దగ్గుబాటి కుటుంబ వారుసుడిగా హితేష్‌ చెంచురామ్‌ని పోటీలో దించే విషయం పై వెంకటేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీ అగ్రనాయకులలో కొందరు ఆయనను కలిసి పార్టీలో చేరమని పర్చూరు నుంచి ఆయన కుమారుడిని పోటీలో దించమని కోరారు. దగ్గుబాటి అంగీకరిస్తే ఆయన సతీమణి పురంధేశ్వరికి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కూడా ఇస్తామని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రారంభంలో సానుకూలత చూపని దగ్గుబాటి ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులపై నిశిత పరిశీలన ప్రారంభించారు.

daggubaati 28122018 1

రెండేళ్ల క్రితం ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ నిర్వహణలో నడిచే విధంగా చీరాల సముద్ర తీరంలో ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దగ్గుబాటి నియోజకవర్గంకు రాకపోకలను భారీగా పెంచారు. తనకు ఆహ్వానం అందిన ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవటం ప్రారంభించారు. ఆయన కుమారుడు వ్యాపారపరమైన పనుల పేరుతో రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి తోడు టీడీపీలో లోకేష్‌ పాత్ర పెరిగిన తర్వాత దగ్గుబాటి హితేష్‌కి లోకే్‌షతో సాన్నిహిత్యం ఉన్నందున టీడీపీకి చేరువ కావచ్చని భావించారు. అయితే బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పురంధేశ్వరి టీడీపీపైన, ప్రత్యేకించి చంద్రబాబుపైన విమర్శల దాడి పెంచటం, మరో పక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు పాలనపై మాటల్లోను, సోషల్‌ మీడియాలోను వ్యతిరేకతను ప్రదర్శించారు. కొంతకాలం నుంచి వైసీపీ అగ్రనాయకులు ఒకరిద్దరు దగ్గుబాటికి టచ్‌లోకి వెళ్లటంతో తిరిగి రాజకీయంగా ముందుకొస్తే వైసీపీలోనే చేరతారన్న ప్రచారం జరుగుతోంది. తొలుత జిల్లాకు చెందిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరికొందరు దగ్గుబాటిని కలిసి పార్టీలో చేరమని ఆహ్వానించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనకు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

daggubaati 28122018 1

అయితే ఇదే సమయంలో, రెండు రోజుల నుంచి ఫోన్‌లో జరుగుతున్న ఒక సర్వే నియోజకవర్గ రాజకీయ వర్గాలలో కలకలాన్ని సృష్టిస్తోంది. పర్చూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నను వేస్తున్నారు. గొట్టిపాటి భరత్‌, దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌లలో ఎవరు ధీటైన అభ్యర్థి అని ఆ ఫోన్‌ వాయిస్‌లో అడగటం విశేషం. అలా నియోజకవర్గంలోని పలువురు వైసీపీ శ్రేణులకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అయితే అందులో ప్రస్తుత పార్టీ సమన్వయకర్త రంగనాథబాబు పేరు లేకపోవటం విశేషం. వైసీపీలో ఇలాంటి సంప్రదాయం లేదని కూడా అంటున్నారు. దీంతో ఆ సర్వేపై పలురకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దగ్గుబాటి వైపు నుంచే ఈ సర్వే జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కుమారుడిని వైసీపీలోకి పంపించాలాని, దాదపుగా నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. source:andhrajyothy

Advertisements

Advertisements

Latest Articles

Most Read