(1)దసరా ఉత్సవములు తేది:21.09.2017 నుండి 30.09.2017 వరకు జరుగును.
(2).మొదటి రోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గం.లకు దర్శనము ప్రారంభించబడును.
(3). మిగిలిన రోజులు ఉదయం 3 గం. నుండి రాత్రి 11 వరకు శ్రీ అమ్మవారి దర్శనం లభించును.
(4). మూల నక్షత్రం రోజున ఉదయం ఉద యం 1 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు దర్శనం లభించును.
(5). దర్శనమునకు కొండ క్రింద వినాయక గుడి నుండి రెండు క్యూ లైను నుండి అనుమతించబడును
(6). కొండపైన ఓమ్ టర్నింగ్ నుండి 5 లైన్లు ఏర్పాటు చేయడమైనది
(7). రధం సెంటరు మరియు మునిసిపల్ ఆఫీసు వద్ద చెప్పులను, సామాన్లును బద్రపర్చు కౌంటర్లు ఏర్పాటుచేయడమైనది
(8). రధం సెంటరు నుండి అశోక స్తంభము ముందు భాగము నుండి టోల్ గేటు పై నుండి క్యూ మార్గము ఏర్పాటు
(9). వయో వృద్దులకు మరియు దివ్యాంగులకు ప్రత్యేక వాహనములను కొండ పైకి వెళ్ళుటకు రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు మరియు రైల్వేస్టేషన్ , బస్టాండ్ నుండి దేవస్థానము వారు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమైనది
(10). భక్తుల సౌకర్యార్ధం 8 ప్రదేశములలో ప్రధమ చికిత్సా కేంద్రములు మరియు అంబులెన్స్ లు ఏర్పాటు
(11). భక్తులకు క్యూ మార్గము నందు ఉచిత త్రాగు నీరు మరియు చంటిపిల్లలకు పాలు ఏర్పాటు
(12). అత్యవసర సమయములో క్యూ లైన్ల నందు భక్తులకు సహాయము చేయుటకు స్వచ్చంద సేవకులు ఎల్లవేళలా అందుబాటులో ఉందురు
(13). క్యూలైన్ల మార్గము నందు ప్రతి 5 మీటర్లకు ఒక అత్యవసర ద్వారము ఏర్పాటు.
(14). శ్రీ అమ్మవారి దర్శనాంతరం రెండు మార్గములు మహామండపము ద్వారా మరియు శివాలయం వద్ద రాయబార మండపం నుండి క్రిందకు మార్గములు ఏర్పాటు
(15). ప్రత్యేక లక్షకుంకుమార్చన రుసుము రూ.3000/- లు గా రెండు బ్యాచులు ఉదయం 7 గం.ల నుండి 9 గం.ల మరియు 10 గం.ల నుండి 12 గం.ల వరకు నిర్ణయించడమైనది
(16).విశేష చండీ హోమం రుసుము రూ.4000/- లుగా ఉదయం 8 గం.ల నుండి 12 గం.ల వరకు జరుగును
(17). మూలనక్షత్రం రోజున రుసుము రూ.5000/- లు గా మూడు బ్యాచులు ఉదయం 7 గం. నుండి 9 గం. లవరకు, 10 గం.ల నుండి 12 గం.ల వరకు మరియు మధ్యాహ్నం 1 గం. నుండి 3 గం.ల వరకు నిర్ణయించడమైనది
(18). ఉభయదాతలు టిక్కెట్లు ఉన్న వారు కొండ పైకి చేరుటకు రాజీవగాంది పార్కు, పున్నమి ఘాట్ నుండి ప్రత్యేకముగా వాహనములు ఏర్పాటు
(19). అర్జున వీధి నందు దేవస్థానము వారు విచ్చేయు భక్తులకు ప్రతిరోజు ఉదయం 8.30 ని.ల నుండు సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 5 గం.ల నుండి రాత్రి 9.30 ని.ల వరకు అన్నప్రసాదము ఏర్పాటు చేయడమైనది
(20). భక్తులకు అందుబాటులో ఉండు విధముగా విజయవాడ బస్టాండు మరియు రైల్వే స్టేషన్ నందు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు
(21). సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండన శాల ఏర్పాటు. దేవస్థానమునకు చెందిన నాయిబ్రాహ్మణులు అందుబాటులో ఏర్పాటు
(22). సీతమ్మవారి పాదాలు వద్ద 30 , పద్మావతి ఘాట్ వద్ద 30, దోభి ఘాట్ వద్ద 20, దుర్గా ఘాట్ వద్ద 10 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు
(23). వివిధ దేవాలయముల నుండి సుమారుగా 300 మంది సిబ్బంది , 2000 మంది ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు వాలంటీర్లు శ్రీ అమ్మవారి సేవలో అదనంగా వినియోగించబడుచున్నారు
(24)దేవస్థానమునకు 24 గంటలు సమాచారము అందించుటకు టోల్ ఫ్రీ నెంబరు: 18004259099