నటుడు మోహన్‌బాబు వైఖరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం విద్యానికేతన్‌ విద్యా సంస్థలకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడం లేదని విద్యార్ధులతో కలిసి ఆయన నిరసనకు దిగడంపై పలువురు మండుపడుతున్నారు. మొదట ఆయన తీరును ఏపీ ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తప్పుబట్టారు. కుటుంబరావు గొంతులో మరి కొందరు గొంతు కలుపుతున్నారు. మోహన్‌బాబును వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య రానురానూ పెరుగుతూ వస్తోంది. తాజాగా మోహన్‌బాబుపై దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కోడలు సుశీల ధ్వజమెత్తారు. దాసరి తనకు గురువు అని చెప్పుకునే మోహన్‌బాబు తమను మోసం చేశారని మండిపడ్డారు. దాసరి నారాయణరావు చనిపోగానే ఆస్తులు అందరికీ సమానంగా పంచుతానని చెప్పిన ఆయన నేటికీ ఆ పని చేయలేదని సుశీల దుయ్యబట్టారు. మోహన్‌బాబు చర్య వల్ల తన కొడుకు మాస్టర్ దాసరి రోడ్డున పడ్డాడని, దాసరి మనవడికే న్యాయం చేయలేని మోహన్‌బాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఉచిత విద్య ముసుగులో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు వసూలు చేస్తున్నారని, దాసరి నారాయణరావు మాటలను దాసరి అరుణ్ వక్రీకరించి వైసీపీలో చేరారని సుశీల పేర్కొన్నారు.

court 23032019

మోహన్‌బాబుపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై మోహన్‌బాబు చీప్‌గా వ్యవహరించారని ఆరోపించారు. మోహన్‌బాబు సంస్థను నడిపిస్తున్నారా? బిజినెస్‌ చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై మోహన్‌బాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షానికి మోహన్‌బాబు వంతపాడుతున్నారని దుయ్యబట్టారు. మోహన్‌బాబు కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారని, ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని కుటుంబరావు తెలిపారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను చెప్పిన విషయాలపై బహిరంగ చర్చలకు సిద్ధమని కుటుంబరావు సవాల్ విసిరారు.

court 23032019

మోహన్‌బాబుపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి శివాజీ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్‌బాబు మాట్లాడారా అని నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సూచించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read