మాజీ మంత్రి వైఎస్ వివేక కేసులో, రోజుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా, వివేక మాజీ డ్రైవర్, అప్రూవర్ గా మారిన దస్తగరి, గత సెప్టెంబర్ లో సిబిఐకి రాసిన వాంగ్మూలం ఈ రోజు బయట పడింది. ఈ రోజు పులివెందుల కోర్టులో నలుగురు నిందితులను సంబంధించి, వాళ్ళ అభియోగ పత్రాలు, వారు రాసిన ఫిర్యాదులు అన్నీ కూడా, సిబిఐ అధికారులు , కోర్టు ఆదేశాల మేరకు, సంబధిత న్యాయవాదులు అందరికీ అందచేసారు. అందులో భాగంగా, దస్తగిరి రాసిన వాంగ్మూలం ఇప్పుడు బయటకు రావటం సంచలనంగా మారింది. గత ఏడాది ఆగష్టులో పొద్దుటూరు కోర్టులో, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అది ఇచ్చిన తరువాత, అతనకి అనేక ప్రలోభాలతో పాటు, బెదిరింపులు కూడా వచ్చాయి. తనను లొంగదీసుకునేందుకు అనేక విధాలుగా చాలా మంది ప్రయత్నాలు చేసారని, వైసీపీకి చెందిన వ్యక్తులు తనను సంప్రదించినట్టు దస్తగిరి, సిబిఐకి రాసారు. అందులో ప్రధానంగా, వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న భరత్ యాదవ్ అనే వ్యక్తి, తరుచూ దస్తగిరి ఇంటికి వచ్చే వాడని, సిబిఐకి ఏ వివరాలు చెప్పావు, ఏ స్టేట్మెంట్ ఇచ్చావ్, ఏమి చెప్పావ్, అవన్నీ కూడా, అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలియ చేయాలని, పదే పదే ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపారు.

dastagiri 22022022 2

అయితే తాను సిబిఐ కనుసన్నల్లో ఉన్నానని, తాను ఎక్కడికీ రాలేనని దస్తగిరి పేర్కొన్నట్టు, చెప్పారు. అయితే ఒకసారి దస్తగిరి ఇంటి వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్దకు రావాలని బలవంత పెట్టటంతో, దస్తగిరి అక్కడకు వెళ్ళటంతో, అక్కడ భరత్ యాదవ్, న్యాయవాది ఉన్నారని, అప్పుడు తనను ప్రలోభ పెట్టారని, సిబిఐకి తప్పుడు సమాచారం ఇవ్వాలని, నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తామని, నీకు పది నుంచి 20 ఎకరాలు ఇస్తామని, ఇప్పుడే రాసి ఇస్తామని, ఎంత కావలి అంటే అంత ఇస్తామని, ఇక నుంచి సిబిఐకి ఏమి చెప్పవద్దని ఒత్తిడి చేసినట్టు దస్తగిరి రాసి ఇచ్చాడు. మరోసారి దస్తగిరి ఇంటికి, భరత్ యాదవ్ వచ్చి, అవినాష్ రెడ్డి తోట వద్దకు రావాలని, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి పంపించారని అక్కడకు వస్తే అన్నీ మాట్లాడుకుందామని చెప్పినట్టు చెప్పాడు. తనను భరత్ యాదవ్ ఫాలో అవుతూనే ఉన్నాడని, ఎక్కడకి వెళ్ళినా తన కదిలకలు తెలుసుకుంటున్నారని, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో భరత్ యాదవ్ చెప్పాడు. ఇప్పుడు ఈ వార్త సెన్సేషన్ అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read