ఒక పక్క ఇరు రాష్ట్రాల మధ్య డేటా వార్ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పై కక్ష సాధింపుకి దిగింది తెలంగాణా... ఒక పక్క చెరువులు ఆక్రమించుకి, కన్వెషన్ సెంటర్లు కట్టుకున్న వారిని వదిలేసి, తన స్థలంలోనే, భవనం చుట్టూ సెట్‌బ్యాక్‌లో ఫ్యాబ్రికేషన్‌ నిర్మాణాలు చేపట్టారని, ఏపి డీజీపీని కక్ష సాధింపులకి గురి చేసారు. ఉన్నట్టు ఉండి, కేసు బయటకు తీసి, ఉన్న పలంగా నష్టం చేకూర్చారు. హైదరాబాద్‌ ప్రశాసన్‌నగర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఇంటికి సంబంధించి అదనపు నిర్మాణాలను మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేశారు. అయితే దీని పై కోర్ట్ అక్షింతలు కూడా వేసింది. 24 గంటల సమయం ఇస్తే ఏం చేస్తారని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. మార్చి 11 వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది.

dgp 06032019 2

అయినా అప్పటికే దాదపుగా కుల్చివేసారు. ప్లాట్‌ నెంబర్‌ 149లో ఆమోదిత ప్లాన్‌కు అదనంగా ఉన్న ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను తొలగించామని అధికారులు తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మూడో అంతస్తు వరకు నిబంధనల ప్రకారం భవనం చుట్టూ ఉండాల్సిన సెట్‌ బ్యాక్‌ స్థలంలో ఐరన్‌ గిర్డర్లు, ఫ్యాబ్రికేషన్‌ ఫ్రేమ్‌లు ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌కు దక్షిణం-తూర్పు వైపు ఓవర్‌ బ్రిడ్జి నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీటన్నింటినీ కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. భవనం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నట్టు ప్రశాసన్‌నగర్‌ సహకార గృహనిర్మాణ సొసైటీ 2017 జూన్‌ 4న ఫిర్యాదు చేసింది. సెట్‌బ్యాక్‌లో చేపట్టిన నిర్మాణాలకు అనుమతి ఉందా? ఆమోదిత ప్లాన్‌ ప్రకారం భవనం ఉందా? వంటి వివరాలు సమర్పించాలని ఆ మర్నాడే ఠాకూర్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇచ్చింది. అదే నెల 15న అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని మరో నోటీసు ఇచ్చింది.

dgp 06032019 3

దీన్ని సవాలు చేస్తూ ఠాకూర్‌ సిటీ సివిల్‌ కోర్టులో వేసిన సూట్‌ను గత ఏడాది ఫిబ్రవరి 5న న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ ఏడాది తరువాత మార్చి 2న తుది నోటీసులు ఇచ్చారు. స్పెషల్‌ డ్రైవ్‌ నేపథ్యంలో నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగానే ఆర్‌పీ ఠాకూర్‌ భవనం చుట్టూ సెట్‌బ్యాక్‌లో ఉన్న నిర్మాణాలు తొలగించామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. డేటా చోరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్తతలు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. డేటా చౌర్యం కేసులో అవసరమైతే ఆంధ్రా పోలీసుల మీద కూడా కేసులు పెడతామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రకటించిన మర్నాడే కూల్చివేతలకు పూనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిటీ సివిల్‌ కోర్టు ఏడాది క్రితం సూట్‌ను కొట్టేస్తే జీహెచ్‌ఎంసీకి ఇప్పుడు గుర్తుకు రావడం వెనుక టైమింగ్‌ ఉందని ఆంధ్రా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read