చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకి జగన్ లేఖ రాసి, ప్రెస్ మీట్ పెట్టి దాన్ని బహిరంగ పరచటం పై అనైతిక చర్యతో పాటుగా, అది కోర్టుని దిక్కారించటం కూడా అవుతుందని పలువురు అభిప్రాయ పడుతూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులను వివాదాల్లోకి లాగే జగన్ చర్యలను ఖండిస్తున్నారు. చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖను మీడియా కు వదలటం పై, సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఖండించింది. రాజ్యంగ పదవుల్లో ఉన్న వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తే, ఎలా అంటూ, ఆ చర్యలను ఖండిస్తూ తీర్మానం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతాయని, వారి పై ఒత్తిడి పెంచే అవకాసం ఉంటుందని అభిప్రాయ పడింది. ఇక ఏపి ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్, జగన్ రాసిన లేఖ బయట పెట్టటం పై, ఆల్ ఇండియా న్యాయమూర్తుల సంఘం కూడా ఖండించింది. న్యాయ వ్యవస్థను కించ పరిచే విధంగా, బలహీన పరిచే విధంగా జగన్ లేఖ రాసారంటూ అభిప్రాయ పడింది. రాజకీయ నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలు అనుమానాస్పదంగా ఉన్నాయని కూడా పేర్కొంది. ఎన్సీఎల్టీ బార్ అసోసియేషన్ కూడా ఈ లేఖ పై అభ్యంతరం తెలుపుతూ తీర్మానం చేసింది. ఇలా వివాద సంఘాలు జగన్ లేఖ బహిర్గతం చేయటం పై అభ్యంతరం తెలిపాయి. అయితే ముందుగా తీర్మానం చేసిన ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మాత్రం, ఆ లేఖ రాసిన తరువాత తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ భయపడి పోతున్నారు. ఇదే విషయం పై ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసారు.

తాము జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను ఖండిస్తూ తీర్మానం చేసామని తమను కొంత మంది కాళ్ళు విరగ్గొడతామని బెదిరిస్తున్నారని, తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటూ, శనివారం ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేసారు. ఢిల్లీ హైకోర్ట్ బార్ అసోసియేషన్ సెక్రటరీ అయిన అభిజిత్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు కూడా ఇదే రకమైన బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాము లండన్ నుంచి ఫోన్ చేసినట్టు, వాళ్ళు బెదిరించారని, ఆ ఫోన్ నెంబర్ కూడా పోలీసులకు ఇచ్చారు. అయితే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా చూస్తే, ఆ ఫోన్ కాల్ కడప జిల్లా నుంచి వచ్చినట్టు గుర్తించారు. 08565 కోడ్ తో, ఆ ఫోన్ కాల్ కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చినట్టు గుర్తించారు. అయితే ఫోన్ చేసింది ఎవరు, ఎందుకు చేసారు, ఎవరు చెప్తే చేసారు అనే దాని పై విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ నుంచి పోలీసుల బృందం, కడపకు వచ్చి విచారణ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఏకంగా సీనియర్ న్యాయవాదులను బెదిరించటం పై, ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారని, త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read