ప్రజలపక్షాన వారిసమస్యలు, బాధలను ఎత్తిచూపడానికి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించడానికి తెలుగుదేశం నేతలు ప్రెస్ మీట్లు పెడుతుంటే, వైసీపీలో మాత్రం బూతులశాఖా మంత్రి, నోటిపారుదలశాఖామంత్రి, కొందరు బ్రోకర్లు, పెత్తందార్లు, పాలెగాళ్లు, కొత్తగా ఒకరిద్దరు డ్రామా కంపెనీవారు మీడియాతో మాట్లాడుతున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. వైసీపీనేతలు, మంత్రులంతా తిట్లు, దూషణలు, అసత్యాలుచెప్పడం, అసంబద్ధ ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేందుకే వారి వాచాలత్వాన్ని వాడుతున్నారని టీడీపీఎమ్మెల్సీ మండిపడ్డారు. ప్రజలంతా వాస్తవాల గురించి ఆలోచించాలని, ఏవిధంగా రాష్ట్రవాసులను వైసీపీప్రభుత్వం మోసగిస్తుందో వారికి అర్థమవుతోందన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి సహకరించాడని పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, తెలంగాణకు మేలుచేయడానికి ఈ ముఖ్యమంత్రి నడుం కట్టాడన్నారు. ఏపీ సొమ్ముతో ఏపీలోని జలాలను తెలంగాణకు తరలించడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమ య్యాడన్నారు. కేసీఆర్ ట్రాప్ లోపడిన వైసీపీప్రభుత్వం రాష్ట్రాన్ని అమ్మేందుకు సిద్ధమైందన్నారు. రెండు, మూడు సార్లు కేసీఆర్ తో రహస్యంగా సమావేశమైన జగన్, ఆయనతనకు మంచి మిత్రుడని చెప్పుకున్నాడ న్నారు. నేడు అదే కేసీఆర్ తెలంగాణలో ఎకరంఅమ్మితే, ఆంధ్రాలో మూడెకరాలు కొనచ్చని అంటున్నా, ఈ ముఖ్యమంత్రి నోరెత్తడంలేదన్నారు. ఆంధ్రాలోని పరిస్థి తుల గురించి తెలంగాణముఖ్యమంత్రి, మంత్రులు హేళ నగా మాట్లాడుతున్నాకూడా ఈ రాష్ట్రమంత్రులు ఎవరూ స్పందించడంలేదన్నారు. విభజనచట్టంప్రకారం రాష్ట్రాని కి రూ.లక్షా 51వేలకోట్ల ఆస్తులు రావాల్సి ఉంటే, వాటిని సాధించాల్సిన రాష్ట్రప్రభుత్వం, వాటన్నింటిని తెలంగాణ కు అప్పగించేశారన్నారు. ఈ విధంగా రాష్ట్రానికి అన్యా యం చేసిన ఈ ప్రభుత్వంపై ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. 1956నుంచి రాష్ట్రఅప్పుల సరాసరి రూ.97వేల కోట్లుంటే, జగన్ ప్రభుత్వం రెండేళ్లుకూడా నిండకముందే రూ.లక్షా57వేలకోట్ల అప్పులు చేసి కూర్చుందన్నారు.

భావితరాల భవిష్యత్ ను కూడాతాక ట్టు పెట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించడం దారుణ మని దీపక్ రెడ్డి వాపోయారు. అప్పులభారం ఏ ప్రభు త్వం తీర్చదని, అంతిమంగా అదిప్రజలపైనే పడుతుం దనే వాస్తవాన్ని రాష్ట్రవాసులు గమనించాలన్నారు. లక్షలకోట్లప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తున్న ప్రభు త్వం, తనను ప్రశ్నిస్తుందన్న అక్కసుతో రూ.18కోట్లతో నడిచే మండలిని మూసేయాలని చూసిందన్నారు. ఇక్కడే ప్రభుత్వఉద్దేశమేమిటో అర్థమవుతోందన్నారు. 22నెలల వైసీపీపాలనలో 11నెలలపాటు కరెక్ట్ గా ఒకటోతేదీన ఉద్యోగులకు, రిటైర్ట్ ఉద్యోగులకు, ప్రజాప్రతి నిధులకు జీతాలు పింఛన్లు ఇవ్వలేదన్నారు. 11నెలలు జీతమే సక్రమంగా ఇవ్వలేనిప్రభుత్వం చేతిలో రాష్ట్రం సు రక్షితంగా ఉందని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదన్నారు. సంక్షేమపథకాలపేరుచెప్పి ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం, పథకాలపేరుతో జనానికి రూపాయిస్తూ, వారినుంచి 3రూపాయలు వసూలు చేస్తోందన్నారు. నిత్యావసరాలధరలు పెంచడం, వివిధ రకాలపన్నులు, ఇసుక, మద్యంధరలతో దోపిడీ, ఆర్టీసీ, విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుద్వారా ప్రజలనుంచి ప్రభుత్వం ఇచ్చేదానికంటే నాలుగురెట్లు అధికంగా వసూలుచేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వంలో కూరగాయలుసహా, అన్నిధరలు ఎలా పెరిగాయో ప్రజలంతా గమనించాలన్నారు. గతంలో 4, 5వందల కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలు వద్దన్న జగన్ ప్రభుత్వం, ఇప్పుడుఉధృతంగా కరోనా రెండోదశ విస్తరి స్తుంటే పరిషత్ ఎన్నిలకు సిద్ధమైందన్నారు.

ఏపీలో వ్యాక్సిన్లు దుర్వినియోగం చేస్తున్నారని ప్రధానే స్వయం గాచెప్పారని , సక్రమంగా ప్రజలకువ్యాక్సిన్ పంపిణీ చేయలేని ప్రభుత్వం, ప్రజలప్రాణాలను రక్షిస్తుందా అని దీపక్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రానికి ముఖ్యమైన ప్రత్యేకహోదా కోసమే టీడీపీ, బీజేపీతోపోరాడిందని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేతు లెత్తేయడంతో టీడీపీ తెగదెంపులు చేసుకుందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకుంటే రాష్ట్రానికి తీవ్రనష్టమని భావిం చే, ఆనాడు చంద్రబాబుప్రభుత్వం కేంద్రంలేని ప్రభుత్వాని కి గుడ్ బైచెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేకహోదాపై ఎవరుసంతకం పెడితే, వారికి మద్ధతిస్తా నని గతంలోచెప్పిన జగన్, నేడుగుడ్డిగా కేంద్రప్రభుత్వ బిల్లులన్నింటికీ ఎందుకు మద్ధతు తెలుపుతున్నాడో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్కనాడైనా ప్రత్యేకహోదా ఇవ్వకుంటే, తాము రాజీనా మాచేస్తామనే మాట వైసీపీనుంచి ఎందుకు రాలేదన్నా రు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్ లో కనీసం ప్రైవేట్ బిల్లుపెట్టడానికి కూడా వైసీపీప్రభుత్వం ఎందుకు ప్రయ త్నించలేదన్నారు? విభజనచట్టంలోని అంశాలపై కేం ద్రం న్యాయంచేయకపోయినా, న్యాయపోరాటంచేయా లనే ఆలోచనకూడా జగన్ ప్రభుత్వం చేయలేదన్నారు.విశాఖ ఉక్కుని అమ్మేస్తామని, అవమానకరంగా కేంద్రం చెబుతుంటే, ఏంజరుగుతుందో తెలిసీకూడా వైసీపీఎంపీ లు, ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలే దన్నారు. కేంద్రప్రభుత్వసంస్థల పెట్టుబడుల ఉపసంహ రణ కమిటీలో వైసీపీఎంపీనే సభ్యుడిగా ఉన్నాకూడా విశాఖఉక్కుఫ్యాక్టరీ అమ్మకాన్ని అడ్డుకోలేదన్నారు.

పక్కరాష్ట్రంలోని కేటీఆర్ విశాఖ ఉక్కు అమ్మకాన్ని అడ్డుకుందామంటుంటే, ఈ రాష్ట్రంఎంపీలు మాత్రం తమ కేమీ అర్థంకానట్లు నటిస్తూ, ప్రజలను ఏమార్చడానికే ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్ మద్ధతిస్తామన్నా, తెలుగురాష్ట్రాలకు చెందిన దాదాపు 50మంది ఎంపీలు వెళ్లి ప్రధానిని కలిసి, విశాఖఉక్కుఅమ్మకాన్ని అడ్డుకునే లా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలుతీసుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్ అడ్డుకోవాలని చూస్తున్నాయని, రాష్ట్రానికి ఎంతో కీలక మైన ప్రాజెక్ట్ పనులను ఈప్రభుత్వమే దారుణంగా నిలిపివేసిందన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆగడంవల్ల, ఏపీ రైతాంగానికి రూ.50వేలకోట్ల వరకు నష్టంవాటిల్లిందన్నా రు. టీడీపీప్రభుత్వంలో 70శాతంవరకు ప్రాజెక్ట్ పనులు జరిగాయని, దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంగా చెప్పినా, వాటికి సంబంధించినఆధారాలను చూపినా, ఈ ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేదన్నారు. ఒకరోజు ఆర్ అండ్ ఆర్ అని, మరోనాడు ల్యాండ్ అక్విజేషన్ అని, పాత ధరలప్రకారం చెల్లింపులుచేస్తామనిచెబుతూ ప్రాజెక్ట్ పనులను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. అమరావతిని కదిలించమనిచెప్పి, అధికారంలోకి రాగానే మూడుముక్కలాట మొదలెట్టారని, ఒక ముక్క అమరావతిలోనే ఉంటున్నప్పుడు, ప్రభుత్వం అక్కడ రూపాయికూడా ఎందుకు ఖర్చుపెట్టడం లేదన్నారు. కేంద్రంనుంచి రాజధాని నిర్మాణానికి రావాల్సిన నిధుల ను ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారో ప్రభుత్వపెద్దలు చ సమధానం చెప్పాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. 470రోజులకుపైగా రైతులు,మహిళలు నిరసన తెలుపు తున్నా, ఈ పాలకులుఒక్కరోజుకూడా వారినిఎందుకు పరామర్శించలేదన్నారు.

మెరుగైన ఇసుకపాలసీ తెస్తా మనిచెప్పి, టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన ఉచిత ఇసు కవిధానాన్ని జగన్ ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. మూడున్నరనెలల్లోనే నిర్మాణరంగాన్నినాశనం చేసి, భవననిర్మాణ, అనుబంధరంగాల కార్మికులను రోడ్డున పడేశారన్నారు. సిమెంట్, స్టీల్, ఇతరత్రా నిర్మాణరంగ సామగ్రి కంపెనీలనుంచి మామూళ్లు వసూలు చేసుకున్న ప్రభుత్వం,కొత్తగా మరోపాలసీ తెస్తామని చెప్పిందన్నారు. పాలసీలు మార్చినా నేటికీ ఇసుక అందుబాటులో లేదన్నారు. పనికిరానీ పాలసీల పేరుతో ప్రభుత్వంఎందుకిలా రాష్ట్రాన్ని నాశనంచేసిందో చెప్పాల న్నారు. మద్యంపాలసీ పేరుతో పాతబ్రాండ్లను తీసేసి, నాసిరకం మద్యాన్ని మార్కెట్లో అమ్ముతూ, దేశంలో ఏరాష్ట్రం చేయనివిధంగా అధికంగా ఆదాయార్జన చేస్తు న్నారని టీడీపీనేత స్పష్టంచేశారు. ఏపీలో అమలవు తున్న మద్యంపాలసీ కారణంగా పొరుగురాష్ట్రాల్లో విపరీ తంగా మద్యంఅమ్మకాలు పెరిగాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంమంతా పక్కరాష్ట్రాలకు పోతోంద న్నారు. ఇక పారిశ్రామికవిధానాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిదన్నారు. జగన్ ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలకారణంగా టీడీపీప్రభుత్వంతో ఒప్పందంచేసుకన్న కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపో యాయన్నారు. రూ.2లక్షలకోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయినా, రాష్ట్రంలో ఎకనామిక్ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామికవేత్తలు గగ్గోలుపెట్టినా ప్రభు త్వం తనపద్ధతి మార్చుకోలేదన్నారు. సంక్షేమ పథకాలు గొప్పగా అమలుచేస్తున్నట్టు చెప్పు కుంటున్న వైసీపీప్రభుత్వం, టీడీపీప్రభుత్వం అమలు చేసిన 36సంక్షేమ పథకాలనుఎందుకురద్దు చేసిందో చెప్పాలన్నారు. మానవత్వం కూడా లేకుండా అన్నక్యాంటీన్లను రద్దుచేశారని, పేదలకు తిండిపెట్టడాని కి కూడా ఈ పిచ్చిప్రభుత్వం రూపాయివెచ్చించలేక పోయిందన్నారు. శాంతిభద్రతలు దారుణంగా తయార య్యాయని, వివేకానందరెడ్డి హత్యకేసులో మనచెల్లి ఢిల్లీ లో మాట్లాడుతూ, తనకున్యాయంజరగలేదనడం మన కు, మనరాష్ట్రానికి సిగ్గుచేటుకాదా అనేదానిపై ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించలేదన్నారు. బూతుల మంత్రి వివేకాహత్యకేసుతో రాష్ట్రానికి సంబంధంలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి సంబంధంలేనప్పు డు హత్యకేసు ఆధారాలను సీబీఐకి ఎందుకివ్వడం లేదో సదరుమంత్రి, ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలన్నా రు.

ఆధారాలు ఇవ్వడంలేదంటూ సీబీఐ స్థానికకోర్టుని, హైకోర్టుని ఆశ్రయించడంపై బూతులమంత్రి కొడాలినాని ఏం చెబుతాడన్నారు. వివేకాహత్యకేసు విచారణలో ప్రభుత్వం సీబీఐకి ఎంతబాగా సహకరిస్తుందో సునీత మాటల్లోనే అర్థమైందన్నారు. పోలీసులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిదన్నారు. ప్రభుత్వం చేసిన 100కుపైగా తప్పులపైకోర్టులనుంచి ఆ దేశాలు వెలువడ్డాకూడా, తప్పుచేశారని కోర్టుచెప్పినా, ప్రభుత్వంగానీ, సదరుశాఖలమంత్రులు గానీ స్పందించ డం లేదన్నారు. బీజేపీ, వైసీపీమధ్య జగన్నాటకం నడు స్తోందని, ఆరెండుపార్టీలు చేస్తున్న లాలూచీ రాజకీయా లను ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ హితవుపలికారు. ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్లిన ప్రతిసారీ, రహస్యంగా కేంద్ర మంత్రులను కలవాల్సిన అవసరమేమిటో, లోపల జరిగి న చీకటిఒప్పందాలను బహిర్గతంచేయకుండా, బయట మరోవిధంగాచెప్పడమేంటో ప్రజలే ఆలోచించాలన్నారు. పార్లమెంట్లో వైసీపీప్రభుత్వం, బీజేపీ పెట్టిన ప్రతిబిల్లుని ఆమోదించిందని, కేంద్రం మనకు న్యాయంచేయనప్పు డు, వారుపెట్టే బిల్లులను ఎందుకుఆమోదిస్తున్నారో ప్రభుత్వపెద్దలే చెప్పాలన్నారు. పిల్లిసుభాష్ చంద్రబోస్ పుదుచ్చేరిలో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నాడని, దాన్నిబట్టే, వైసీపీ-బీజేపీ మధ్యనున్న చీకటి ఒప్పంద మేమిటో అర్థంచేసుకోవాలన్నారు. ప్రమాణస్వీకార వేళ పొరుగురాష్ట్రంలోని స్టాలిన్ ను తీసుకొచ్చిన జగన్, ఇప్పుడు స్టాలిన్ అంటున్న మాటలకు ఏంసమాధానం చెబుతాడన్నారు. తామేమీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా బీజేపీతో రాసుకుపూసుకుతిరగమని, అంతచేవలేని వాళ్లం కామని స్టాలిన్ అంటుంటే, ఏపీ సీఎం ఎందుకు స్పందించడంలేదన్నారు. ఈ విధంగా అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు చేస్తున్న అన్యాయంపై వారేఆలోచించాలని, దీపక్ రెడ్డి సూచించారు. తిరుపతి ఉపఎన్నికలో ఓటేసే ప్రతిఒక్కరూ, ప్రభుత్వ నీతిమాలిన చర్యలపై తప్పనిసరిగా ఆలోచనచేయాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read