ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నిర్వహించతలపెట్టిన ధర్మపోరాట దీక్షకు వెళ్తున్న రైళ్లను రైల్వే అధికారులు భోపాల్ వద్ద నిలిపివేశారు. దీంతో రైల్వే అధికారులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ధర్మ పోరాట దీక్షలో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిన్న రాత్రి రైళ్లల్లో బయలుదేరారు. అయితే... ఈ రైళ్లను భోపాల్ దగ్గర రైల్వే అధికారులు నిలిపివేశారు. కాగా... ఈ సమాచారాన్ని టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో... రైళ్లకు అనుమతివ్వాలని ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ సంబంధిత రైల్వే అధికారులను కోరారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నానికే రైళ్లు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా రాత్రి పది గంటలలోగా ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.

deeksha 10022019

మరో పక్క, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో రేపు నిర్వహించతలపెట్టిన ధర్మపోరాటదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 7గంటలకు రాజ్‌ఘాట్‌లో చంద్రబాబు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత ఏపీ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేయనున్నారు. కాగా... ఈ దీక్షలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ ఆందోళనా కార్యక్రమానికి 7వేలమందికిపైగా వస్తారని అంచనా వేస్తున్నారు.

deeksha 10022019

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కూడళ్లలో భారీ హోర్టింగులు ఏర్పాటు చేశారు. దీక్ష కోసం వచ్చేవారికి బస, భోజన ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపే అవకాశం ఉండటంతో.. దీక్షా వేదిక దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు దీక్ష తర్వాత మంగళవారం చంద్రబాబు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ భేటీకాబోతున్నారట. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటూ విభజన హామీల అమలులో జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read