ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, రాష్ట్ర విభజన తరువాత, వైసీపీ పార్టీ, ఒక పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అప్పటి దాకా పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస పార్టీ, రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు తరువాత చిన్న పార్టీగా అయిపోయిన తరువాత, వైసీపీకి లైఫ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వారు అందరూ కాంగ్రెస్ ని కాదని, వైసీపీ వైపు చూడటం మొదలు పెట్టారు. అయితే చాలా మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని అర్ధం. కానీ తన తండ్రి పేరుని రాజకీయంగా వాడుకోవటానికి, జగన్ మోహన్ రెడ్డి పార్టీ పేరుని ఇలా వాడుకుని ఉండవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ చేసే సమయానికి, అప్పటికే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇంకో పార్టీ ఉండటంతో, జగన్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడా వాడకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే కాల క్రమంలో, ఎవరూ దాన్ని పట్టించుకోలేదని చెప్పాలి. వార్తల్లో కానీ, వివిధ పార్టీలు కానీ, చివరకు వైసీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సంబోధించింది. అయితే, ఎవరూ దీని పై ఫిర్యాదు చేయక పోవటం అది అలా నడుస్తూ వహ్చింది. అయితే ఈ మధ్య, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకి షోకాజ్ నోటీస్ ఇచ్చే సమయంలో, లెటర్ హెడ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంతో, అభ్యంతరం వ్యక్తం చేసారు ఎంపీ. 

ycp 0512020 2

తనకు ఇచ్చిన బీఫారంలో యువజన శ్రామిక రైతు కాంగ్రస్ పార్టీ అని చెప్పి, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారని, అభ్యంతరం తెలిపారు. దీంతో అసలు పార్టీ అయిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయ్యి, తమ పేరు వాడుకుంటున్నారు అంటూ, ఢిల్లీ హైకోర్టులో కంప్లైంట్ ఇచ్చింది. దీని పై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్‌ జయంత్‌నాథ్‌ ఈ పిటీషన్ విచారించారని, ఈ సందర్భంగా వైసిపీ రాజకీయ పార్టీ ఏనా అంటూ, జడ్జి విస్మయం వ్యక్తం చేసారు అంటూ, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, షైక్‌ మహబూబ్‌ బాషా మీడియాకు తెలిపారు. ట్రేడ్ మార్క్ చట్టం ప్రకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు వాడుకునే హక్కు తమకు ఉందని జగన్ పార్టీ తరుపు న్యాయవాదులు వాదించగా, మీది రాజకీయ పార్టీ ఏనా అంటూ న్యాయమూర్తి అడిగారని, షైక్‌ మహబూబ్‌ బాషా తెలిపారు. జగన్ పార్టీ వేసిన అఫిడవిట్ పై కౌంటర్ కు సమయం అడిగామని, దీంతో ఈ కేసు వచ్చే ఏడాది జనవరి 29కి వాయిదా వేసారని తెలిపారు. జగన పార్టీ వేసిన అఫిడవిట్ మీడియాకు ఇవ్వటానికి, న్యాయమూర్తి ఒప్పుకోలేదని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read