Sidebar

27
Mon, Jan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై కేంద్రం ఒక కన్ను వేసి ఉంచుంది. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటన పై, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇక విశాఖపట్నం ప్రజలు అయితే, ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాం, మాది ఇప్పటికే ఒక పెద్ద సిటీ, ఇప్పుడు వచ్చి, దీన్ని నాశనం చేస్తారు అంటూ భయపడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, గత ఏడు రోజులుగా చేస్తున్న ఆందోళన, ఢిల్లీని కూడా తాకింది. ముఖ్యంగా రైతులు, మహిళలు, పిల్లలు కూడా ఏడు రోజులుగా ఉద్యమంలో పాల్గునటంతో, ప్రధాన మంత్రి కార్యాలయం కూడా సమాచారం తెప్పించుకుంటుంది. అసలు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుంది ? నిజంగానే అక్కడ రైతులకు సమస్య ఉందా ? వారు స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నారా ? వారి ఆందోళన, వారి ఇబ్బందులు ఏమిటి ? అనే విషయాల పై, ప్రధాని కార్యాలయం ఆరా తీస్తుంది.

velagapudi 24122019 2

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పౌర హక్కు బిల్లు పై చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇబ్బంది పడుతుంది. ఏ సమస్య లేని ఏపిలో కూడా, ప్రభుత్వం కావాలని చేసిన ప్రకటన పై, అక్కడ కూడా ఆందోళన మొదలు అవ్వటం, కేంద్రాన్ని చికాకు పెడుతుంది. దీంతో ఏపిలో పరిస్థితి పై కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. అసలు రాష్ట్రం మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేసింది ? అప్పులతో నెట్టుకు వస్తున్న రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టే వెసులు బాటు లేదు కదా ? దీనిలో ఉన్న రాజకీయం ఏమిటి ? ఉద్యోగులు దీనికి ఒప్పుకుంటున్నారా ? మిగతా జిల్లాల వారి అభిప్రాయం ఎలా ఉంది ? మొత్తం వ్యవహారాల పై కేంద్రం వాస్తవ పరిస్థితితో రిపోర్ట్ లు తెప్పించుకుంటుంది.

velagapudi 24122019 3

అయితే ఇది ఇలా ఉంటే, ఈ పరిణామంతో రాష్ట్రం కూడా అలెర్ట్ అయ్యింది. కేంద్ర ఐబి రంగంలో దిగటంతో, వారు పిఎంఓకి ఎలాంటి నివేదికలు ఇస్తున్నారు ? కేంద్రం, రాష్ట్రం తీసుకున్న మూడు రాజధానుల పై ఏమని అనుకుంటుంది, తదితర అంశాల పై ఆరా తీస్తుంది. ఇందు కోసం, రాష్ట్రప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న అధికారి ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఈ అధికారి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ శాఖ కార్యదర్శిని కలిసి, ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అనుకోవటంతో, ఆయనకు నిరాస ఎదురైంది. ఆయనకు అపాయింట్‌మెంట్‌ లభించలేదని తెలిసింది. అయితే, ఢిల్లీ పైనే ఏపి ప్రభుత్వం నిఘా పెట్టటం, వారు ఏమని అనుకుంటున్నారో తెలుసుకోవటం, ఈ పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read