చంద్రబాబు అనవసరంగా మాట్లడారు.. మాట్లాడితే మాత్రం, అవతలి వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోలేని విధంగా ఉంటుంది. కేసీఆర్ ఎన్ని బూతులు తిట్టినా, అది వారి విజ్ఞత అని చెప్పి వదిలేసే సంస్కారం ఉంది చంద్రబాబుకు. ఇలాంటి వాళ్ళందరికీ టైం వచ్చినప్పుడు మాత్రం, సరైన విధంగా దెబ్బెస్తారు. నిన్న ఢిల్లీ పర్యటనలో అదే చేసారు చంద్రబాబు. పక్క రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి మీతో కలిసి నడుస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ నిజానికి తాము తెలుగు ప్రజల సంక్షేమం దృష్ట్యా కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకుందామని అడిగానని, కానీ టీఆర్ఎస్ అధినేతలే తమ ప్రతిపాదనను తిరస్కరించారని చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పనేముందని ఎద్దేవా చేశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశంలో రెండే కూటములు ఉన్నాయని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ కూటమి వైపు ఉంటారన్నది ఆయన్నే అడగాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా, తానేం తప్పు చేశానంటూ ఎదురు ప్రశ్నించారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ను తానే అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దానని గుర్తుచేశారు.
అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తన జోక్యం అసలు ఉండదని, తానేమీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబోనని స్పష్టం చేశారు. మరోవైపు ఆత్మగౌరవం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా చంద్రబాబు స్పందించారు. అసలు ఆత్మగౌరవం పదం పలికే అర్హత వారికుందా అని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ పేరు చెబితే జనం తన్నేలా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీయేనని పునరుద్ఘాటించారు.