దేశ రాజధాని ఢిల్లీలో, ఆంధ్రపదేశ్ కు చెందిన విధ్యార్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మిక ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం, 500 మంది వరకు విధ్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఢిల్లీ వచ్చారు. అయితే, ఏపీ ఇంటర్‌బోర్డు గ్రేడింగ్‌ విధానంతో, ఢిల్లీ యూనివర్సిటీలో పెడుతున్న ఇబ్బందులకు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గత రెండు రోజులుగా, యూనివర్సిటీలో ప్రవేశాల కోసం వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఉన్న నిబంధనల ప్రకారం, ఆంధ్రపదేశ్ ఇంటర్‌ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్‌ను, 10తో గుణించి పెర్సెంటేజ్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఢిల్లీ యూనివర్సిటీ వర్గాలు, మాత్రం 10తో కాకుండా, 9.5తో గుణించి ఆ పెర్సెంటేజ్ తీసుకుంటామని అంటున్నారని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం 100 మార్కులకు మెరిట్‌ తీసుకుంటున్నారు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ బోర్డు ఇచ్చిన గ్రేడ్‌ మార్కులను 10తో గుణించి 100 మార్కులకు ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశాలు తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.

అయితే ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు మాత్రం అలా తీసుకోకుండా, ఆ నిబంధన అమలు చెయ్యటం లేదని విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ గొడవ తలెత్టటంతో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం వచ్చిన సుమారు 500 మంది ఏపి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదని, త్వరగా స్పందించి, తగు సూచనలు చేసి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఏపి విధ్యార్ధులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో, ఢిల్లీ యూనివర్సిటీ అధకారులు, ఏపీ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేశారు. మరి ఈ సమస్య పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి, మన విద్యార్ధులకు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read