ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే., జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేద్దామని ఆయన ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులు చేస్తోందనే విషయాన్ని సీబీడీటీకి ఫిర్యాదు చేయటంతో పాటు అక్కడ నిరసనలు తెలపాలని ఎంపీల భేటీలో నిర్ణయించారు. అమరావతి ప్రజా వేదికలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై ఇందులో ప్రధానంగా చర్చించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల, రాజకీయ పరిణామాలు, పొత్తులపైనా కీలక చర్చ జరిగింది. 36 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తున్న రాజకీయ విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

cbn bjp 07102018 2

‘మనం భాజపాయేతర పార్టీల సహకారం తీసుకోవాలి. భావసారూప్య పార్టీలతో కలసి పనిచేయాలి. 36 ఏళ్లుగా తెదేపా రాజకీయ విధానమదే. మనముందున్న ప్రత్యామ్నాయాలు రెండే. కాంగ్రెస్‌పై వ్యతిరేకంగా ఉండటమా? భాజపాకు వ్యతిరేకంగా పనిచేయడమా? భాజపా మనపైకి ఒంటికాలిపై వస్తోంది. ఈ నేపథ్యంలో భాజపాయేతర పార్టీల సహకారం తీసుకోక తప్పని పరిస్థితి మనది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ అయినా, యునైటెడ్‌ ఫ్రంట్‌ అయినా.. ఆ తర్వాత యూపీయే, ఎన్డీయే అయినా ప్రజాస్వామ్య అనివార్యతల వల్ల ఏర్పడినవే’ అని గుర్తుచేశారు. చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రంపై పోరాట కార్యాచరణ, దేశ రాజకీయాల్లో తెదేపా పోషించాల్సిన పాత్ర తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. చారిత్రక కారణాల వల్లే తెలంగాణలో కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలన్నదే తెదేపా లక్ష్యమని, ఎన్టీఆర్‌ తెదేపా స్థాపించిందే అందుకోసమని చంద్రబాబు పేర్కొన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రెండు సదస్సులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు…సర్కారియా కమిషన్ సిపార్సులపై మొదటి సదస్సు నిర్వహించాలని., రైతు సమస్యలపై రెండో జాతీయ సదస్సు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. శీతాకాల సమావే శాల్లోపు పోరాట ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కేంద్రం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎలా అడ్డుకోవాలో తెలియక ఐటీ దాడులు చేయిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. దొంగ సర్వేలతో నైతిక స్థయిర్యం దెబ్బతీయాలని బీజేపీ-వైసీపీ చూస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. లాలూచి రాజకీయాలు చేస్తున్నాయన్ని ధ్వజమెత్తిన ఆయన.., వారి కుట్రలు నెరవేరవని తేల్చిచెప్పారు. తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా ఏ పార్టీతోనూ తెదేపాకు పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read