ముస్లింలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆలూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు. మోదీ గెలిస్తే మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జగన్‌కి ఓటేస్తే నరేంద్రమోదీకి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. మళ్లీ మోదీ వస్తే దేశంలో ముస్లింలకు ఓట్లే లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు. మైనార్టీల కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ మన ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని ఆరోపించారు. నెత్తిన అప్పుపెట్టి మనల్ని తరిమేశారని విమర్శించారు. జగన్‌, కేసీఆర్‌ ఒకరికొకరు పొగుడుకుంటున్నారన్నారు. జగన్‌కు కేసీఆర్‌ని చూస్తే భయమని చెప్పారు.

game 27032019

కేసీఆర్‌, మోదీకి ఊడిగం చేయడానికి జగన్‌ సిద్ధపడ్డాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే మోదీ మళ్లీ అధికారంలోకి వస్తాడని జగన్‌ అంటున్నాడని తెలిపారు. రాష్ట్రానికి మోదీ నమ్మకద్రోహం చేశారని ఫైరయ్యారు. బీసీల కోసం ప్రత్యేకంగా బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించారు. ఇకపై ప్రతి ఏడాది డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొదుపు ఉద్యమం నేర్పించింది తానేనన్నారు. మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. రూ.68 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. పసుపు-కుంకుమ చెక్కులు చెల్లవని వైసీపీ నేతలు నాటకాలు ఆడారని మండిపడ్డారు.

game 27032019

ఈసీ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వొద్దని చెప్పారని గుర్తుచేశారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తుంటే వైసీపీ దొంగలు అడ్డుపడ్డారని ఫైరయ్యారు. మా పొట్ట ఎందుకు కొడుతున్నారని వైసీపీని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ నెలలోనే రైతు రుణమాఫీ 4, 5వ విడతల చెక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతిని రూ.3 వేలకు పెంచుతామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రుల శక్తికి ఆకాశమే హద్దు అని అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read