ఈ రోజు అసెంబ్లీలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను అంటూ ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు చేసిన ప్రకటన గురించి, ఈ రోజు తెలుగుదేశం శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గుర్తు చేసారు. 45 ఏళ్ళకే మీరు పెన్షన్ ఇస్తాను అన్నారు, ఎప్పుడు ఇస్తారు అని అడిగిన పాపానికి, ముగ్గురు తెలుగుదేశం సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసారు. ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లడుతూ, తాను అలా అనలేదని, 4 ఏళ్ళ 75 వేలు ఇస్తాను అని చెప్పానని, వీడియో చూపించారు. మేము కూడా జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు 45 ఏళ్ళకే 2 వేలు పెన్షన్ ఇష్టం అని చెప్పిన వీడియోను, ఇస్తాం అని, అది కూడా అసెంబ్లీలో వెయ్యాలని తెలుగుదేశం సభ్యులు కోరారు.

deputy 2307019 1

దీంతో అసహనానికి గురైన అధికార పక్షం, ఈ అంశం ముగిసింది అని, వేరే టాపిక్ లోకి వెళ్ళాలని చెప్పటంతో, తెలుగుదేశం సభ్యులు ఆందోళన చేసారు. దీంతో ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసారు. కేవలం ప్రశ్న అడిగితేనే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు అని అడిగినా, మార్షల్స్ పెట్టి, బయట పడేసారు. ఇది విషయం పై తెలుగుదేశం శాసనసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను ఎందుకు సస్పెండ్ చేసారో చెప్పాలి అంటూ, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ కు వెళ్లి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ అడిగారు. ఎలానటి కారణాలు లేకుండా, కేవలం ప్రశ్నలు అడిగితేనే సస్పెండ్ చేస్తారా అంటూ, తెలుగుదేశం సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఈ విషయం పై డిప్యూటీ స్పీకర్ కూడా పునరాలోచనలో పడ్డారు.

deputy 2307019 1

అధికార ప్రతిపక్ష నాయకులను పిలిపించుకుని, చర్చలు జరిపారు. సభ సజావుగా నడిపేందుకు అందరి సహకారం కావాలని, దీని కోసం, ఏమి చెయ్యాలో చెప్పండి అంటూ, చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే, ప్రతిపక్ష సభ్యులు కోరిన, సస్పెన్షన్ ఎత్తివేత ప్రతిపాదనను, అధికార పార్టీ ద్రుష్టికి స్పీకర్ తీసుకువెళ్ళారు. అలాగే శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో డిప్యూటీ స్పీకర్ భేటీ అయ్యారు. వీరితో భేటీ అయిన తరువాత, మరోసారి తెలుగుదేశం నేతలను పిలిచారు. దీంతో, సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేసారని తెలుగుదేశం పార్టీ అభ్యర్ధనను, పరిగణలోకి తీసుకుని, డిప్యూటీ స్పీకర్ కోన కీలక నిర్ణయం తీసుకునే అభిప్రాయం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read