కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జేడీఎస్ అధినేత దేవేగౌడ ఫోన్ చేశారని తెలుస్తోంది. బాబుతో పాటు తెలంగాణా సియం, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు. జేడీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు కోరారు. కర్ణాటకలో రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన మరికొద్ది రోజుల్లో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అందుకు మరికొంత మంది శాసనసభ్యులు భాజపాకు మద్దతివ్వాలి. కర్నాటకలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమని భావిస్తున్న ఆ రెండు పార్టీలు వారిని వేరే రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

cbn phone 17052018 2

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు కలిసి జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్‌ వీరికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే కాంగ్రెస్‌, జేడీఎస్‌ సభ్యులను బెంగళూరులోని రిసార్ట్‌ ఉంచారు. కానీ మరింత జాగ్రత్త కోసం జేడీఎస్‌ ఎమ్మెల్యేలను వైజాగ్‌, హైదరాబాద్‌లకు తరలిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేరళకు పంపించనున్నట్లు సమాచారం. కేరళలోని వామపక్ష ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

cbn phone 17052018 3

కాగా, కర్ణాటకఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌తు 38 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తమకు ఇతర ఎమ్మెల్యేల మద్దతు ఉందని యడ్యూరప్ప చెబుతున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు చెబుతున్నాయి. బీజేపీ కొంత మంది కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు గాలం వేస్తోంది. జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ.. కేంద్రంపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలన్నారు. బాబు, కేసీఆర్, నవీన్ పట్నాయక్, మమతలు ముందుకు రావాలన్నారు. కర్ణాటకలో గవర్నర్ చర్య అనైతికమన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read