జాతీయ స్థాయిలో భావసారూప్యం కలిగిన భాజపాయేతర పార్టీలను ఏకం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. ఇకపై ఆయన వారంలో రెండు మూడు రోజులు జాతీయ రాజకీయాలకు కేటాయించనున్నారు. భాజపాయేతర పక్షాలను సంఘటితం చేసేందుకు ఇటీవలే దేశ రాజధానిలో పర్యటించిన చంద్రబాబు... గురువారం మరోసారి దిల్లీ వెళుతున్నారు. ఈ నేపధ్యంలో, మహాకూటమి ఏర్పాటు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మాజీ ప్రధాని దేవేగౌడ ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

cbn 31102018 2

బీజేపీని సాగనంపేందుకు విపక్షాలు మహాకూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని, మహాకూటమి ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మహా కూటమితో భవిష్యత్‌లో ప్రధాని రాహుల్‌ గాంధీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని, రాహుల్‌ ప్రధాని అయ్యేందుకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని మాజీ ప్రధాని, జెడీఎస్‌ పార్టీ వ్యవస్థాపకులు దేవేగౌడ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్‌కు నేడు ఏఐసీసీ అధ్యక్షుడుగా రాహుల్‌ వ్యవహరించడం గర్వకారణమని, అలాగే ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయ అనుభవం పొందడం విశేషమన్నారు.

cbn 31102018 3

మరో పక్క చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, నిన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఫోన్ చేసారు. చంద్రబాబు కడపలో ఉన్న సమయంలో, ఆయన ఫోన్ చేసారు. ‘‘నిరంకుశ పోకడల నుంచి దేశాన్ని కాపాడాలి. సమాఖ్య స్ఫూర్తికి భాజపా గండి కొడుతోంది. ప్రజాస్వామ్య విలువల్ని మంటగలుపుతోంది. లౌకికవాదం ప్రమాదంలో పడింది. మీ కృషిని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలి. జాతీయ స్థాయిలో మీకున్న పరపతితో భాజపాయేతర పార్టీలను ఏకం చేయాలి. మీకు సమాజ్‌వాదీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం...’’ అని అఖిలేష్‌ పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read