నిన్న మంత్రి దేవినేని ఉమ గారు ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాదనాల ప్రసాదరావును పరామర్శించడానికి వెళ్ళి, పరామర్శించి వస్తుండగా అంబులెన్సుల హడావుడి చూసి డాక్టర్లను ఏమిటి అని అడిగారు. అప్పుడు డాక్టర్లు నందిని అనే పాపకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని అవయవదానం చేశారని అవయవాలు సేకరించేందుకు హైదరాబాదు నుండి డాక్టర్లు వచ్చి ఏర్పాట్లు చేశారని చెప్పారు.వెంటనే నందిని దగ్గరకు వెళ్ళిన మంత్రి దేవినేని ఎందుకైనా మంచిది అవయవదానం వద్దు ఎంత ఖర్చయినా ఆపాపను బ్రతికించాలి అని చెప్పారు.
తల్లిదండ్రులు సైతం మాకు స్తోమత లేదు మేం భరించలేం మేం తీసుకెళ్తాం అనగా మంత్రి దేవినేని వారిని వారించి ఎంత కావాలి అని అడిగారు. అందుకు తల్లిదండ్రులు 4,00,000 రూపాయలు ఖర్చవుతుంది అని చెప్పగా ఆ మొత్తాన్ని నేను ఏర్పాటు చేస్తాను తక్షణమే పాప కోలుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసి చికిత్స చేయమని డాక్టర్లను అదేశించారు. తన అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే నాలుగు లక్షల రూపాయలను 20 గంటల్లో మంజూరు చేయించి ముఖ్యమంత్రి వద్దనుండి నేరుగా ఎల్ ఓ సి ని తీసుకుని మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఆంద్ర హాస్పిటల్ కు వెళ్ళి తల్లిదండ్రులకు అందజేశారు.
అనంతరం వైద్యులతో మాట్లాడిన మంత్రి దేవినేని ఎంత ఖర్చయినా పాపను బ్రతికించాలని కోరారు. మంత్రి చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరువబోమని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో పక్క, మంత్రి చేసిన సహాయం తెలుసుకుని అందరూ, మంత్రిని అభినందించారు. పాప ప్రాణం డాక్టర్లు కాపాడాలని, కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఆపదలో ఉన్నవారు ఎవరైనా, ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తే చాలు, అది నిజమైన సమస్య అని తెలుసుకుంటే, ఎంత వరుకైన సహాయం చేస్తున్నారు.