4 రోజుల్లో 3.3 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలయ్యా యని, ముఖ్యమంత్రి కుటుంబ పత్రిక, జగన్ అవినీతి పత్రిక సాక్షిలో రాశారు. అలా రాయడానికి సిగ్గుండాలని, రైతుల కు ఇవ్వాల్సిన నీటిని సముద్రం పాలు చేసినందుకు ఈ ముఖ్యమంత్రి సిగ్గు పడాలని, ఆయన చేయాల్సింది చేయకుండా, అక్కడది చేశారు.. ఇక్కడది చేశారని ప్రధానికి లేఖలు రాస్తే ఉపయోగం ఏముంటుందని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "ప్రధానికి, ఇతర కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తున్న ముఖ్య మంత్రికి విభజన చట్టం గుర్తులేదా...లేక గుర్తుకు రావడంలేదా ? ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ -11లో ఏం చెప్పారు? రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా సరే, చట్టంలోని నిర్ణయాలను అమలు చేయాలని, అలా అమలు పరచని రాష్ట్రం, అందుకు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం విధించే ఆర్థిక పరమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. 11వ షెడ్యూల్ లోని సెక్షన్ 85.7(ఈ)లో ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పా రు. ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో ఈసెక్షన్ లోని వివరాలను ఎందుకు గుర్తుచేయలేదు? అదే విధంగా సెక్షన్ -10 లో కొన్ని ప్రాజెక్టులు, వాటి నీటి కేటాయింపుల వివరాలు కూడా యథావిధిగా కొనసాగుతాయని కూడా చెప్పడం జరిగింది. అలాచెప్పిన ప్రాజెక్టుల్లో హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులున్నాయి. ఆ 6 ప్రాజెక్టులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సినవే. వాటికి సంబంధించిన నీటి కేటాయింపులు కూడా పార్లమెంట్ ద్వారా చేయబడిన రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నబడినవే. అవేమీ నేనో, జగన్మోహన్ రెడ్డో చేసిన చట్టాలుకావు. నీటికొరత ఉన్నప్పుడు, వ్యవసాయానికి, తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి నీటిలభ్యతపై ఘర్షణ తలెత్తినప్పుడు, ఏ రాష్ట్రమైనాసరే తొలి ప్రాధాన్యత వ్యవసా యానికి, తాగునీటికే ఇవ్వాలని కూడా చట్టంలో చెప్పడం జరిగింది. తొలి ప్రాధాన్యత వ్యవసాయపరంగా కృష్ణాడెల్టా రైతాంగానికి, తాగు నీటి పరంగా ప్రాధాన్యత రాయలసీమకు ఇవ్వాలని, మూడో ప్రాధాన్యత గానే విద్యుత్ ఉత్పత్తిని పరిగణించాలని చాలా స్పష్టంగా పేర్కొంటే, ఈ ముఖ్యమంత్రి పొరుగు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయలేక పోతున్నాడు.

ఆయన లాలూచీ వ్యవహారాలు, ఎన్నికల పొత్తు, హైదరాబాద్ లోని తన ఆస్తులను, తన ల్యాండ్ బ్యాంకుని కాపాడుకో వడానికే ఇలా చేస్తున్నాడు. ఎన్నికల కోసం పొరుగు నుంచి వేలకోట్లు తెచ్చుకున్నందుకు, ఇప్పుడు రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను వారికి తాకట్టుపెట్టారు. పార్లమెంట్ చేసిన విభజన చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్న అంశాలను ఈ ముఖ్యమంత్రి, ప్రధానికి, కేంద్ర జల శక్తి మంత్రికి రాసిన లేఖల్లో ఎందుకు రాయలేదు? ఉనికిలో ఉన్న ఏపీలో వివిధ ప్రాంతాలకు చేయాల్సిన నీటి సరఫరా విషయమై, చేయాల్సిన కేటాయింపుల విషయమై, నదీ జలాల ట్రిబ్యునల్ హామీ ఇచ్చిన నీటి వాటా యథాతథంగానే ఉంటుందని కూడా చట్టంలో చెప్పారు. చట్టాలను దేవినేని ఉమా మర్చిపోయినా, జగన్మోహన్ రెడ్డి మర్చిపో యినా, గూగుల్ మర్చిపోదు కదా? గూగుల్ లో అట్టా కొడితే ఇట్టా సమాచారం వస్తుంది. గూగుల్ కు గుర్తున్న విషయాలు, ఆక్స్ ఫర్డ్ లో చదివిన ముఖ్యమంత్రికి గుర్తులే కపోవడం విచిత్రంగా ఉంది. జగన్ బాబుకి, అనిల్ కుమార్ కు తెలుగులో చెబితే అర్థంకాదు కాబట్టి, గూగుల్ లోని సమాచారమంతా ఇంగ్లీషులోనే ఉంది. రెండురాష్ట్రాల మధ్యతలెత్తిన నీటి వివాదాలకు సంబంధించి కేఆర్ఎంబీకి కూడా ఈ ముఖ్యమంత్రి లేఖరాశారు. ఇన్నిమీటింగులు జరిగినా, ఏనాడూ జగన్ బాబుకి విభజన చట్టంలోని అంశాలు గుర్తుకు రాలేదు. ఇదీ జగన్ బాబు లాలూచీ వ్యవహారం. ఈ ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలనికూడా ఏనాడూ కోరలేదు. నీటి వివాదాల పరిష్కారానికి జగన్ రెడ్డి ఏంచేస్తున్నాడో, మీడియా ముఖంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన నాయకులకు ఎంత చెప్పినా ఉపయోగం ఉండటంలేదు. ముఖ్యమంత్రో, ఇరిగేషన్ మంత్రో మాట్లాడితే సమాధానం చెబుతాను గానీ, సాక్షి మేనేజర్లకు కాదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read