దేవినేని ఉమా మహేశ్వర రావు పత్రికా సమావేశం వివరాలు. మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశమంతా ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటోంది. ఆయన అడుగుజాడల్లో గ్రామ స్వరాజ్యం సంపాదించాల్సిన పల్లెలు.. ఇవాళ బలవంతంపు ఏకగ్రీవాలతో అట్టుడుకుతున్నాయి. వైసీపీ పాలెగాళ్లు గ్రామాల మీద పడి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వార్డు సభ్యులుగా/ సర్పంచ్ లుగా నిలబడాలంటే పోలీస్ స్టేషన్ లలో క్లియరెన్స్ లు తెచ్చుకోవాలని భయపెడుతున్నారు. ప్రతిఒక్కరూ ఈ చర్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం వెలుతుంటే వీఆర్వోలు అందుబాటులో లేకుండా ఉంటున్నారు. మంత్రులు, శాసనసభ్యులు ప్రాంసరీ నోట్ల మీద అగ్రిమెంట్లు రాయిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలను గట్టిగా ఎదుర్కోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్లు మ్యాన్యువల్ గా తీసుకునేలా వీఆర్వోలు బాథ్యతలు చేపట్టాలి. సర్టిఫికేట్లు, క్లియరెన్స్ కావాలని వైసీపీ నాయకులు బెదిరిస్తారు. ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే పెద్ద పెత్తున నామినేషన్లు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. లేదంటే ఏదో విధంగా ఇబ్బందులు క్రియేట్ చేసి నామినేషన్లను అడ్డుకొని బలవంతపు ఏకగ్రీవాలను చేయాలని తాడేపల్లి రాజప్రసాదం కనుసన్నల్లో దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎప్పటికప్పుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి, డీజీపీ కార్యాలయానికి, ఎన్నికల కమీషన్ కార్యాలయానికి, చీఫ సెక్రటరీ కార్యాలయానికి, వాట్సాప్ గ్రూపులు ద్వారా, ఐటీడీపీ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలి. జగన్ నవరత్నాల నవమోసాలు భయటపడ్డాయి. చంద్రబాబు నాయుడు పాలనలో అన్న వ్యవస్థలు మొదటి మూడు స్థానాల్లో నిలిచేవి. కాని గత 20 నెలల్లో అన్ని రంగాలు కుదేలయ్యాయి. మీడియా ఛానళ్ల గొంతు నొక్కేశారు. ఏపీ ఫైబర్ నెట్ ఆన్ చేస్తుంటే ముఖ్యమంత్రి ఫోటో, సాక్షి ఛానల్ మాత్రమే కనపడుతున్నాయి. ఏబీఎన్, టీవీ - 5 చానళ్ల ప్రచారాలను అడ్డుకుంటున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుటుంబమే సాక్షి పత్రిక, ఛానల్ నడుపుతూ మీడియా గొంతును నులుముతున్నారు.
టీవీ -5 మూర్తి, ఏబీఎన లో వెంకట కృష్ణ కనపడకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడేవి కనపడకూడదన్న భావంతో మీడియా హక్కులను హరిస్తూ ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కనపడుతుంది. మంత్రులు, సలహాదారులు పోటీ పడి ముఖ్యమంత్రి కనుసన్నల్లో రాజ్యాంగ వ్యవస్థల మీద బూతుల మాట్లాడిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థ స్పూర్తి, సుప్రీంకోర్టు తీర్పులను అవమాన పరిచే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. నేడు ధర్మాసనాల తీర్పుల మీద ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే అవకాశం వస్తే ముఖ్యమంత్రి వారి హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ముఖ్యమంత్రి రివ్యూలతో సరిపోడుతున్నారు గాని నోరు తెరిచే పరిస్థితి లేదు. నేడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లల్లో ఏం చేశామని, ఏం చేయబోతున్నామని దమ్ము, నిజాయితీ మాట్లాడితే ముఖ్యమంత్రి భయపడుతున్నారు. మీ నవరత్నాలు ఏం అయ్యాయి? సుప్రీంకోర్టు తీర్పు వస్తే తాడేపల్లి రాజప్రసాదంలో ఆ 4 గంటలు ఏం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు రాగానే రాష్ట్ర గవర్నర్ దగ్గరకు వెళ్లి శాసనసభ రద్దు చేసి ఎన్నికల కోరతామన్న ముఖ్యమంత్రి ఎందుకు భయపడ్డారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్ది రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏం మట్లాడారు? ఏం జరిగింది? ఆ 4 గంటల్లో ప్రశాంత్ కిషోర్ రిపోర్టు, ఇంటలిజెన్సీ రిపోర్టులు వచ్చాక ముఖ్యమంత్రి తెల్ల జెండా ఊపి 6 గంటల తరువాత సజ్జల ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు భయపడ్డారు? దమ్ము ధైర్యం ఉంటే శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లతానన్నారు కాని ఎందుకు భయటపడ్డారు?
దమ్ము దైర్యం ఉంటే సుప్రీంకోర్టు తీర్పు తరువాత మీ మంత్రులు, మీ తాబేదార్లు, మీ శాసనసభ్యులు రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయస్థానాలపై తిట్టే తిట్ల మీద 5 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సన్నబియ్యం ఇవ్వడం చేతకాదు గాని లిక్కర్ మాత్రం పంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేసే వారందరికి నాశిరకం మద్యం ఇచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఏడాదికి రూ.3,500 కోట్లు మద్యంలో దోపిడీ జరుగుతుంది. అమ్మ ఒడి కింద ఒక పిల్లవాడు వెలుతుంటే రూ.15000, ఇద్దరికి రూ.30000 ఇస్తామన్నారు. కాని కేవలం ఒక్క పిల్లవాడికే ఇస్తున్నారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికి ఖర్చు చేసుకుంటున్నారు. నాశిరకం మద్యంతో పేదల ప్రాణాలను గాల్లో కలుస్తున్నాయి. సామాన్యుడి బలహీనతలు అడ్డం పెట్టుకొని పేకాట, మద్యానికి వైసీపీ నాయకులు బానిసలుగా మారుస్తున్నారు. నేడు మీరు చేస్తున్న వాటికి ప్రజలు బుద్ది చెబుతారు. వైఎస ఆర ఆసరా 45 ఏళ్లకు పెన్షన్ అన్నారు. రూ.3వేలు పెంచుతామన్నారు కాని రూ.300 పెంచడం చేతకాలేదు. 20 నెలల్లో జగన్ కు ఎందుకు ఓటు వేయాలి? ఏం చేశావు? కరెంట్ చార్జీలు పెంచినందుకా? రేషన్ బియ్యం కందిపప్పు రూ.27, పంచదార రూ.14 చేసినందుకా? కంది పప్పు కొంటేనే బియ్యం ఇస్తారా? మీరు ఇచ్చే బియ్యం తినేటట్టు ఉందా? ఒక్క సారి తాడేపల్లి రాజప్రసాదంలో కందిపప్పు, బియ్యం ఉడికించి మీడియాకు చూపించాలి. ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు, చెత్తకు పన్ను వేస్తున్నారు, పెట్రోల్ డీజిల్, నిత్యావస సరుకులు, కూరగాయలకు రేట్లు పెరిగాయి. ఇంట్లో బాత్ రూంలు, కంబోర్డులు ఎన్ని ఉన్నాయో లెక్క కడుతున్నారు.