రాజధానిరైతులు, మహిళలపై జరిగిన దాడిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు , రాష్ట్రంలో రాక్షసరాజ్యం నడుస్తోందని, పాశవికంగా దాడిచేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని, జరిగినదానిపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించిందని, న్యాయస్థానం వ్యాఖ్యలు రాష్ట్రానికి చెంపపెట్టని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ఆనందంకోసం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాడుతున్న భాషని చూసి సభ్యసమాజం సిగ్గుపడుతోందని, వారుచేస్తున్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పైశాచికానందం పొందుతున్నాడని ఉమా మండిపడ్డారు. హైకోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం పోలీస్‌బలగాల్ని ఉపసంహరించుకొ ని, రైతులు, జే.ఏ.సీనేతలు చేస్తున్న శాంతియుత ధర్నాలకు అనుమతివ్వాలన్నారు. ఎక్కడ మహిళలు బయటకువస్తే, అక్కడ సెక్షన్లు 14-4, 30 అమలుచేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏంచేసినా వారికే సెక్షన్లు వర్తించవన్నారు.

జగన్‌, కేసీఆర్‌లు ఇప్పటివరకు 6సార్లు భేటీ అయ్యారని, ఏప్రయోజనాలకోసం, ఏఅంశాలకోసం చర్చలు జరిపారో ఒక్కసారికూడా జగన్‌ వివరణ ఇవ్వలేదన్నారు. రెండురాష్ట్రాలమధ్య రూ.లక్షా97వేలకోట్ల ఆస్తుల పంపకాలు జరగాల్సిఉందని, షెడ్యూల్‌ 9, 10 కింద అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ ఆస్తులకి సంబంధించి రూ.5,500కోట్లు పంపకాలు జరగాల్సి ఉందని, ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కంలనుంచి రూ.5,700కోట్లు రావాల్సిఉందని, వేలాదిఉద్యోగుల సమస్య అలానే ఉందని, దానికి సంబంధించిన కోర్టుఉత్తర్వులు అమల్లోకి రాలేదన్నారు. ఇన్ని సమస్యలుంటే, అధికారులులేకుండా జగన్మోహన్‌రెడ్డి ఏకాంతచర్చలకు వెళ్లడమేం టని ఉమా నిలదీశారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని తన వందలఎకరాల సెటిల్‌మెంట్‌ కోసం వెళ్లాడో, తన అనుమాయుల కంపెనీల్లో తనకున్న వాటాలపై చర్చించడానికి వెళ్లాడో జగనే సమాధానం చెప్పాలన్నారు. పాము తనపిల్లల్నితానే తిన్నట్లుగా, పక్క రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధికోసం ఈరాష్ట్ర ముఖ్యమంత్రి పాటుపడటం సిగ్గుచేట న్నారు. 5కోట్లమంది నమ్మకాన్ని వమ్ముచేసిన జగన్మోహన్‌రెడ్డి, హైదరాబాద్‌ అభివృద్దికి సహకరిస్తూ, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడని ఉమా దుయ్యబట్టారు.

అమరావతి అనేది ఒకస్ఫూర్తని, 5కోట్లమందికి ప్రతీకని, అలాంటి రాజధానిని మూడు రాజధానుల ప్రకటనతో చంపేశారని, పోలవరాన్ని పండబెట్టి, కేసీఆర్‌తో ఏకాంతచర్చలు జరపడం జగన్మోహన్‌రెడ్డికే చెల్లిందన్నారు. వెన్నెముకలేని మంత్రులు కోటలోఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని, వారికి పౌరషం, బాధ్యత లేవన్నారు. 151మంది ఎమ్మెల్యేలు తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్నారన్నారు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ సహా, 9నగరాల అమరావతి నిర్మాణానికి రైతులు తమభూములు త్యాగం చేశారనే విషయాన్ని మరిచిన మంత్రులు ప్లాట్లు ఇస్తాం.. భూములిస్తాం.. డబ్బులిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో సాగిన భూములదందా, 23వ తేదీనుంచి విశాఖకేంద్రంగా కొనసాగుతుందని ఉమా స్పష్టంచేశారు. జగన్‌ ఆలోచనలు ముఖ్యమంత్రిస్థాయిలో లేవని, అందువల్లే ప్రజలకు ఇన్ని సమస్యలన్నారు. గుడివాడలో జరుగుతున్న కోతముక్క, కోడిపందాలు, మూడుముక్కలాటను చూడటానికి వెళుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఇళ్లపట్టాలివ్వడానికి వెళుతున్నట్లు చెబుతున్నాడన్నారు. రోమ్‌ నగరం తగలడుతుంటే, నీరోచక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్లుగా, ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలకు వెళుతున్నాడన్నారు. విజయవాడలో ర్యాలీచేశారన్న నెపంతో 3000 మంది మహిళల్ని అరెస్ట్‌చేసిన పోలీసులు, వారిలో 490మందికి తాఖీదులిచ్చార ని, పాస్‌పోర్టులు రద్దుచేస్తామని బెదిరిస్తున్నారన్నారు. మహిళలపై పోలీసులు ప్రవర్తించి న తీరు, వారిపై జరిగిన దాడిని ఎవరూ సమర్థించరన్నారు. ఆరుభేటీల్లో కేసీఆర్‌తో ఏం చర్చించారో.. ఈనాడేం మాట్లాడారో జగన్‌ స్పష్టంచేయాలన్నారు. కేసీఆర్‌ ఉదార ంగా నీళ్లిస్తున్నాడని కోతలుకోసిన జగన్‌, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇతరజిల్లాల్లో జరుగుతున్న సాగునీటిప్రాజెక్టుల పనులన్నింటినీ ఎందుకు రద్దుచేశాడని ఉమా ప్రశ్నిం చారు. మద్యం దుకాణాల రద్దుపేరుతో నాన్‌డ్యూటీ పెయిడ్‌లిక్కర్‌ను రాష్ట్రంలో విచ్చల విడిగా విక్రయిస్తున్నారని, జగన్‌ తెలివితక్కువనిర్ణయం వల్ల మద్యానికి బానిసలైనవా రంతా తెలంగాణకు వేలకోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నారని ఉమా దుయ్యబట్టారు.

రాజధాని ఉద్యమంకోసం రైతులు, మహిళలు, కూలీలు చనిపోయినా, ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతల్లో కనీసస్పందన లేదని, పిచ్చోడికి, వెర్రివెంగళప్పకు అధికారమి వ్వడంద్వారా ఇదంతా ప్రజలుచేసుకున్న దురదృష్టమని ఉమా మండిపడ్డారు. తన, తన సహచరుల రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాభివృద్ధికోసమే, జగన్‌ విశాఖజపం చేస్తున్నాడన్నా రు. పక్కరాష్ట్రాల్లో స్వరాష్ట్రంగురించి చులకనగా మాట్లాడుతున్నా, ఆంధ్రులను అవమా నిస్తున్నా జగన్‌లో చలనం లేదన్నారు. జీ.ఎన్‌.రావు, బీ.సీ.జీ కమిటీలుపోయాయని, ఇప్పుడు పవర్‌లేని హైపవర్‌కమిటీ ఏం చేస్తుందన్నారు. కమిటీలు చెప్పాల్సిందాన్ని ముఖ్యమంత్రి ముందే శాసనసభలో చెప్పాడని, దానికి అనుగుణంగానే అజయ్‌కల్లం ఆదేశాలప్రకారం ఆయా కమిటీలు రిపోర్టులు ఇచ్చాయన్నారు. అమరావతిని చంపడాని కి ముఖ్యమంత్రి ఇప్పటివరకు 5కమిటీలు వేశాడని, 34వేలఎకరాలు, రూ.10వేలకోట్ల నిర్మాణాలు, రాజధాని వెలుపల రూ.10వేలకోట్లకు పైగా జరిగిననిర్మాణాలు ఆయనకు కనిపించడంలేదన్నారు. రాష్ట్ర జీడీపీ రూ.9లక్షల20వేలకోట్ల జీడీపీలో విశాఖపట్నం జీడీపీ రూ.2లక్షల30వేలకోట్లని, అలాంటి నగరాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదన్నారు. జగన్‌నిర్ణయంతో రాజధానికి భూములిచ్చామని అమరావతి రైతులు ఏడుస్తుంటే, తమ భూములు లాక్కుంటారని విశాఖవాసులు ఏడుస్తున్నారని ఉమా దెప్పిపొడిచారు. గత ఏడునెలల్లో విజయసాయి ఆధ్వర్యంలో విశాఖచుట్టుపక్కల 52వేల ఎకరాలు చేతులు మారాయన్నారు. బయటిరాష్ట్రాల నాయకులుకూడా జగన్‌కనుసన్నల్లో విశాఖలో భూములుకొన్నారని, వాటిలావాదేవీలకోసమే జగన్మోహన్‌రెడ్డి కీలుబొమ్మలా మారాడని, 23వతేదీకల్లా విశాఖవెళ్లేలా ఇప్పటికే తట్టాబుట్టా సర్దేశాడన్నారు. జే.ఏ.సీ ఆధ్యర్యంలో రేపు భోగిమంటల్లో జీ.ఎన్‌.రావు, బీ.సీ.జీ, ఇతరకమిటీలిచ్చిన బోగస్‌ నివేదికలను తగులబెట్టాలని, రాష్ట్రమంతా నిరసనప్రదర్శనలు నిర్వహించాలని ఉమా పిలుపునిచ్చారు.జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌తో ఏఏ అంశాలు, సమస్యలపై చర్చించాడో మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌ సమక్షంలో చెప్పే దమ్ము,ధైర్యం జగన్‌కున్నాయా అని దేవి నేని సవాల్‌విసిరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read