కేంద్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా పేరు చెప్తే, చంద్రబాబు లాగా ఎప్పుడు పని పని అంటూ కష్టపడే నాయకుడిగా పేరు ఉంది. పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేపించటానికి, కట్తల మీద పడుకుని మరీ, పనులు చేపించిన చరిత్ర ఉంది. పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ పూర్తి చెయ్యటానికి, అను నిత్యం కృష్టి చేస్తున్నారు. ఇలాంటి ఉమాని ఓడించటానికి, జగన్ మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆపరేషనే నడుపుతున్నారు. దీని కోసం, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ను బరిలోకి దింపారు. తనను ఓడించిన ప్రత్యర్థిపై ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న కోరికతో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కొద్ది నెలలుగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.
వసంత కృష్ణప్రసాద్ రాకతో మైలవరంలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ప్రలోభాలతో ప్రసన్నం చేసుకునే పనిలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఆటోవాలాలకు కొత్త ఖాకీ బట్టలు అందించడం మొదలు పండుగల పేరుతో మహిళలకు లక్ష చీరలు పంచారు. గోడ గడియారాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో వివిధ సంఘాలకు పెద్ద ఎత్తున ఆర్థికసాయం అందిస్తూ వస్తున్నారు. అడగని వారిదే తప్పు అన్న రీతిలో విచ్చలవిడిగా డబ్బులు పంచడంలో వైసీపీ నేతలు ముందంజలో ఉన్నారు. తమ ప్రలోభాల పర్వానికి పోలీసులు ఎక్కడ అడ్డుతగులుతారోనన్న సంశయంతో తాజాగా పోలీసు అధికారులకే డబ్బులు ఎరవేసి తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే అది బెడిసికొట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గడిచిన ఆరు నెలలుగా కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పెద్దఎత్తున నియోజకవర్గ ప్రజలకు తాయిలాలనూ అందిస్తున్నారు. మరోవైపు తమకు అడ్డుగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించేందుకు సైతం వైసీపీ నేతలు వెనుకాడటం లేదు. గత సెప్టెంబరులో గుంటుపల్లిలో వైసీపీ బ్యానర్లను తొలగించిన విషయంలో గుంటుపల్లి కార్యదర్శి నల్లారి నరసింహారావును వసంత వెంకట కృష్ణ ప్రసాదు తండ్రి, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు బెదిరించారు. తాజాగా మరోసారి పోలీసులకు లంచాలు ఇచ్చేదుకు తెగబడి వైసీపీ నేతలు మరోసారి తమ బరితెగింపును చాటుకున్నారు.