నిన్న గొల్లపూడిలో, యధావిధగా మంత్రి కొడాలి నాని, బూతులతో, దేవినేని ఉమా, చంద్రబాబు పై నోరు పారేసుకున్నారు. కొడాలి నానికి తోడు,గన్నవరం నుంచి టిడిపి నుంచి గెలిచి, వైసీపీకి జంప్ కొట్టిన వంశీ కూడా గొల్లపూడి వచ్చి, ఇష్టం వచ్చినట్టు దేవినేని ఉమా పై మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడుతూ, నీ ఇంటికి వస్తా, నిన్ను కొడతా, అదీ ఇదీ అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఆయిన మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందో లేదో కానీ, ఒక మంత్రి ఇలా బహిరంగంగా బూతులు మాట్లాడుతూ, నీ ఇంటికి వచ్చి కొడతా, బడిత పూజ చేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్య పోయినా, కొడాలి నాని నోరు గురించి తెలిసి లైట్ తీసుకున్నారు. అయితే, నిన్న కొడాలి నాని మరీ రెచ్చిపోయి మాట్లాడటంతో, ఎప్పుడు లేనిది దేవినేని ఉమా కూడా చాలా ఘాటుగా స్పందించారు. పోరంబోకు కుక్క అంటూ, కొడాలి నాని భాషలోనే సమాధానం చెప్పారు. సమాధానం చెప్తూ, కొడాలి నాని నా ఇంటికి వచ్చి నన్ను టచ్ చేస్తా అంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడు, ఇంటికి ఎందుకు, నేను రేపు ఉదయం గొల్లపూడి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం ముందు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చుంటాను, జగన్ మోహన్ రెడ్డి వస్తాడో, బూతులు మంత్రి వస్తాడో, ఎవడు వస్తాడో వచ్చి టచ్ చేయండి అంటూ చాలెంజ్ చేసారు. కొడాలి నాని పెద్దగా, మాట్లడాతాడు కాబట్టి, ప్రభుత్వం ఆయనదే కాబట్టి, దేవినేని ఉమా చాలెంజ్ ని స్వీకరిస్తారని అందరూ అనుకున్నారు.

uma 19012021 2

అయితే దేవినేని ఉమా కార్యక్రమానికి పర్మిషన్ లేదు అంటూ, రాత్రి నుంచి పెద్ద ఎత్తున పోలీసులు గుమిగూడారు. ఆయన ఇంటి వద్ద, సందులో,మొత్తం పోలీసులతో నింపేశారు. చీమ చిట్టుకుమనటానికి కూడా లేదు. అయితే ఈ సందర్భంలో ఆ పోలీస్ వలయాన్ని చేదించుకుని దేవినేని ఉమా, చెప్పిన టైంకి, గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చారు. అయితే ఆయన ఎలా వచ్చారో పోలీసులకు ఆర్ధం కాక షాక్ తిన్నారు. దేవినేని ఉమా ఇంటి ముందు పోలీసులు ఉన్నారు కానీ, ఆయన నిన్న రాత్రే తన ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళారని తెలుస్తుంది. ఉదయం పది గంటల సమయంలో ఒక క్యాప్, మొఖానికి మాస్క్ పెట్టుకుని, సాధారణ ప్రజలు లాగ, ఉమా నడుచుకుంటూ గొల్లపూడి సెంటర్ వచ్చారు. అయితే పోలీసులు ఎవరూ ఆయన్ను గుర్తు పట్టలేదు. ఆయన నడుచుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్ళగా, అక్కడ పోలీసులు పసిగట్టి, వెంటనే దేవినేని ఉమాని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంత పోలీస్ వలయాన్ని చేధించుకుని మరీ, చెప్పిన టైంకి, చెప్పినట్టే, ఉమా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రావటంతో, పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు. https://youtu.be/UUANAxwN4mU

Advertisements

Advertisements

Latest Articles

Most Read