అక్రమంగా అరెస్ట్ అయ్యి, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తన భర్తకు ప్రాణ హా-ని ఉంది అంటూ, మాజీ మంత్రి దేవినేని ఉమ సతీమణి అనుపమ, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కు, రాష్ట్ర గవర్నర్ కు, కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర హోం మంత్రికి కొద్ది సేపటి క్రితం లేఖ రాసారు. అధికారంలో ఉన్నా లేక పోయినా, తన భర్త దేవినేని ఉమా, ప్రజా జీవితంలో చాలా క్రియాసీలకంగా ఉన్నారని, అవినీతి పరులకు వ్యతిరేకంగా, ప్రత్యేకంగా అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా దేవినేని ఉమాకు పేరు ఉందని చెప్పి, అనుపమ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే మైనింగ్ మాఫియా గుండాలు దేవినేని ఉమా లక్ష్యంగా చేసుకుని అతని ప్రాణంతో పాటుగా, కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసారని, అలాగే ఆస్తులకు కూడా నష్టం జరిగే విధంగా స్కెచ్ వేసారని, అనుపమ ఆ లేఖలో వివరించారు. దీంతో పాటుగా, దేవినేని ఉమ పై, రెండు రోజులు క్రితం, జీకొండూరులో దా-డి జరిగిందని, కానీ ఆయన పైన ఎదురు తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారని పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో అక్కడ జైలు అధికారిని అకస్మాత్తుగా బదిలీ చేయటం వెనుక, తనకు తీవ్రమైన సందేహాలు , భయం ఉన్నాయని ఆమె పలు సందేహాలు వ్యక్తం చేసారు.
ఈ లేఖకు, రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారి బదిలీ ఉత్తర్వులను జత చేసి అనుపమ, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ పంపారు. గతంలో పోలీసుల అదుపులో , ఈ ప్రభుత్వంలో జరిగిన పలు సంఘటనలు కూడా ఆమె, ఈ సందర్భంగా వారి దృష్టికి తెచ్చారు. అదే విధంగా జైలులో ఉండగా, జరిగిన హ-త్యా ఉదంతాలను కూడా పేర్కొన్నారు. దేవినేని ఉమా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలషులు, మద్దతుదారులు, అనుచరులు, ఆయనకు ప్రాణ హా-ని ఉందని, తీవ్ర ఆందోళన చెండుతున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. అందువల్లే రాజమండ్రి జైల్లో ఉన్న తన భర్త దేవినేని ఉమకు, మైనింగ్ మాఫియా నుంచి తగిన రక్షణ కల్పించాలని ఆ లేఖలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కు, రాష్ట్ర గవర్నర్ కు, కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర హోం మంత్రికి కొద్ది సేపటి క్రితం లేఖ రాసారు. నిన్న కూడా ఇదే అంశం పై, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చేన్నాయుడు ఆందోళన వ్యక్తం చేయగా, ఈ రోజు ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా, ఉమ భద్రత పై ఆందోళన వ్యక్తం చేసారు.