ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టులను తిట్టటం మన అధికార పార్టీకి ఫ్యాషన్ అయిపొయింది. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి కూడా ఇలాగే కోర్టుల పైన, జడ్జిల పైన ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయటం పరి పాటి. మరీ ముఖ్యంగా మన తెలుగు జాతికి గర్వ కారణం అయిన చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ విషయంలో, జగన్ మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఆయన పై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయనేదో చంద్రబాబు మనిషి అని భావించి, ఆయన్ను టార్గెట్ చేయటం అందరికీ తెలిసిందే. అమరావతి కేసులో, జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెల పేర్లు కూడా చేర్చి, చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తరువాత ఏకంగా అప్పటి చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు, ఎన్వీ రమణ పైన కంప్లెయింట్ ఇవ్వటం, ఆయన్ను చీఫ్ జస్టిస్ అవ్వకుండా చూడటం ఇవన్నీ చేసిన విషయాలు తెలిసిందే. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో, కుయిక్తులు పారలేదు. మన తెలుగు వారు అయిన జస్టిస్ ఎన్వీ రమణ, ఈ దేశానికి అత్యున్నత న్యాయ పదవిలో, చీఫ్ జస్టిస్ గా ఎంపిక అయ్యారు. అప్పటి నుంచి ఆయన పని తనం దేశం మొత్తం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే కొన్ని నిర్ణయాలు ఎన్వీ రమణ తీసుకున్నారు.

cj 24122021 2

అయితే ప్రతి సారి దేవుడు స్క్రిప్ట్ అని చెప్పే, వైసీపీ నేతలు, ఇప్పుడు ఆ దేవుడు స్క్రిప్ట్ తమకే వచ్చిందని గ్రహించి, కక్క లేక మింగ లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, జస్టిస్ ఎన్వీ రమణ, తన సొంత గ్రామంలో, మూడు రోజులు పాటు పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటన ఉంటుంది. చీఫ్ జస్టిస్ అయిన తరువాత, సొంత గ్రామం వస్తూ ఉండటంతో, పెద్ద ఎత్తున ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం కూడా ఇప్పుడు ప్రభుత్వమే చేయాల్సిన పరిస్థతి వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లలో అరుదైన దృశ్యం కనిపించింది. మన రాష్ట్ర ముద్దు బిడ్డ అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు వేసి, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ జస్టిస్ కు స్వాగతం చెప్తూ, మొత్తం బ్యానర్లతో నింపేశారు. అంతే కాదు, రేపు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇచ్చే విందులో, జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గుంటున్నారు. ఏ నోటితో అయితే, తిట్టారో, ఇప్పుడు ఇలా స్వాగతం చెప్పటం దేవుడి స్క్రిప్ట్ కదా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read