మన ప్రభుత్వ సలహదారులకి, ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు సలహాలు ఇచ్చేందుకు పని ఏమి లేదో ఏమో కానీ, ఇప్పుడు ఫేసుబుక్ లో, వాళ్ళ మీద, వీళ్ళ మీద కామెంట్స్ పెడుతూ రెచ్చగొడుతూ, తిట్టించుకుంటూ, సగటు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారు. ఆయన పేరు దేవులపల్లి అమర్ , ఈయన పక్కా తెలంగాణా వాది అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మిన ఇతగాడికి, ఎలా ఏపి సొమ్ము దోచిపెట్టాలని అనిపించిందో, ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఇక పోతే ఈ దేవులపల్లి అమర్ ని, సిపిఐ నారాయణ ఎక్కడ హార్ట్ చేసారో తెలియదు కానీ, దేవులపల్లి అమర్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. "కమ్యూనిస్ట్ ఉద్యమం తెలుగు జాతి కి కొందరు గొప్ప నాయకులను అందించింది.వరద తో బాటు బురద వొచ్చినట్టే కొన్ని ఆంబోతులను కూడా అచ్చోసి తెలుగు సమాజం మీదికి వొదిలింది. అటువంటి ఒక ఆంబోతు ల్యాంకో హిల్స్ ప్రాంతాల్లో తిరుగుతుంటుంది. జాగ్రత్త, కుమ్ముతుంది. " అంటూ నారాయణను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. నారాయణకు విషయం తెలవటంతో, దేవులపల్లి అమర్ పోస్ట్ చేసిన కామెంట్ సెక్షన్ లోకి వచ్చి, దులిపి దులిపి పడేసారు. దీంతో ఇద్దరి మధ్య, ఫేస్ బుక్ వార్, మొదలైంది. ఇద్దరూ ఆపకుండా చెలరేగిపోతున్నారు.
నారయణ స్పందిస్తూ, "జనాలకు నీబతుకు నాబతుకు తెలుసు మిత్రమా . గాజుకొంపలోకూర్చొని రాళ్ళెస్తే యెవరికినష్టం ?? నేను నీతి యేరుకుంటే నీవు అనైతిక అవినీతినెన్నుకున్న సంగతి జర్నలిస్ట్ లోకానికి తెలుసు నాయనా . నవ్వులపాలవుతుంది నీవు . పనీపాటలేకుండా అధికారపంచన చేరి గొడ్డుబోతు ఆవులాగా మేస్తున్నావ్ .యింకాశిగ్గు లేకుండా వాగకు. సమాజంలో గౌరవ ప్రతిష్టలున్న "దేవులపల్లి"యింటిపేరుపెట్టుకుని చెట్టుపేరుచెప్పి కాయలమ్ముకునేనువ్వు ఆయింటిలోనే చెడపుట్టావు . నీనీచ ప్రవ్రుత్తి సబ్యసమాజం అసహ్యించుకుంటుంది.కమ్యూనిష్ట్ పార్టి వెంట్రుకకుకూడా సరిపోని నువ్వా నన్నుగురించి మాట్లాడేది. ప్రస్తుతం నీవు క్రుత్యమంగా బెదిరింపులు చేసే పరిస్తితిలోవున్నావు . నేనుయెల్లవేళలా నీలాంటివాళ్ళను ప్రతిఘటించే స్తాయిలోనేవుంటాను గుర్తుంచుకో. నీవు బతుకుకోసం జర్నలిస్తువి యేగడ్డయిన మేస్తవ్ . నేనువుద్యమాన్ని నమ్ముకునేవాడిని . ప్రజాసంగాలతొపాటు జర్నలిస్ట్ రంగంపైకూడా అవగాహనవుంటుంది . నీలాగా బాయిలోవున్న కప్పనుకాదు . నేనుమరుగుజ్జు వామనలాంటివాడిని . కబడ్ దార్" అంటూ నారాయణ కౌంటర్ ఇచ్చారు.