ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేవాలయాల పై జరుగుతున్న వరుస ఘటనలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ పై ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యమైన ఎన్నో ఘటనలలో, ఎవరు చేసారో తెలియకపోవటంతో, పోలీస్ శాఖ విమర్శలు ఎదుర్కుంటుంది. ఇక మరో పక్క ప్రభుత్వం పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ కాబట్టి, హిందూ దేవాలయాల పై వరుస ఘటనలు జరుగుతున్నా, పట్టించుకోవటం లేదని, ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకు పడ్డాయి. ఇక రామాతీర్ధం ఘటన తరువాత, ఈ అంశం తారా స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం వద్ద సమాధానం లేదు, పోలీస్ శాఖ కూడా ఈ విషయానికి ఒక లాజికల్ కంక్లుజన్ ఇవ్వలేకపోయింది. దీంతో ప్రతిపక్షాలను తట్టుకోవాలి అంటే, ఒక్కటే మార్గం అని డిసైడ్ అయిన అధికార పక్షం ఎదురు దాడి మొదలు పెట్టింది. విజయసాయి రెడ్డి అయితే, రామతీర్ధం ఘటన, చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని, వ్యాఖ్యలు చేసారు. అయితే అందరినీ సాక్ష్యాలు ఇవ్వమని ఉత్తరాలు రాసే డీజీపీ గారు మాత్రం, విజయసాయి రెడ్డిని సాక్ష్యాలు అడగలేదు అనుకోండి అది వేరే విషయం. ఇక తరువాత జగన్ మోహన్ రెడ్డి కూడా, ఆలయాల పై జరుగుతున్న వరుస ఘటనల వెనుక ప్రతిపక్షం ఉందని, ఒకటికి నాలుగు సార్లు చెప్పారు.
ఆలయాలు ధ్వంసం చేసిన వారే, వాటిని చూడటానికి వస్తున్నారని, రధాలు తగలబెట్టిన వాళ్ళే రధయాత్ర చేస్తున్నారని, ఇలా ప్రతిపక్షాలు చేస్తున్నాయని, ఎప్పుడు సంక్షేమ కార్యక్రమం మొదలు పెట్టినా, ఇలాగే జరుగుతున్నాయి అంటూ తేల్చి చెప్పారు. అయితే జగన్ ను ఆధారాలు అడగాలి అంటూ, డీజీపీకి టిడిపి లేఖ రాసింది. అయితే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఈ ఘటనలు అన్నీ ప్రతిపక్షం చేస్తుందని చేసిన ప్రచారం అంతా ఫేక్ అని, నిన్నటి డిజిపి ప్రెస్ మీట్ తో, తేలిపోయింది. నిన్న డీజీపీ మాట్లాడుతూ, ఈ ఘటనల వెనుక ఇప్పటి వరకు ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదని చెప్పారు. 44 ముఖ్య ఘటనలలో, 29 తెల్చేసాం అని, అవి కొన్ని దొంగలు, కొన్ని మూఢ నమ్మకాలతో, ఒకటి రెండు పిచ్చి వాళ్ళు, ఒకటి రెండు అడవి జంతువులు, కొన్ని నిధి కోసం, ఇలా చేసినట్టు తమ విచారణలో తేలినట్టు చెప్పారు. అంతర్వేది, రామతీర్ధం సహా మిగత ఘటనల పై విచారణ జరుగుతుందని తెలిపారు. ఒక పక్క వైసీపీ నేతలు, ఇవన్నీ ప్రతిపక్షం చేస్తుందని చెప్తే, డీజీపీ మాత్రం, కుట్ర కోణం లేదని చెప్పారు.