ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు నెలల నుంచి కేంద్రాన్ని కోరుతూ వస్తుంది... కేంద్రం మాత్రం సాంకేతిక కారణాలు చూపించి, ఫైల్ తిప్పి పంపింది... అయినా చంద్రబాబు, మళ్ళీ అవే పేర్లు కేంద్రానికి పంపించారు, రెండో సారి కూడా కేంద్రం తిప్పి పంపింది... దీంతో చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు... మా రాష్ట్రంలో అధికారిని నియమించటానికి కూడా ఇంత రాద్దాంతం చెయ్యలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్రానికి లేఖ రాశారు... అయినా సరే, ఈ నెల 22న డిజిపి ఎంపిక కోసం జరగాల్సిన కమిటీ సమావేశం కూడా కేంద్రం వాయిదా వేసింది...
ఈ పరిణామాలు అన్నీ గమనించిన చంద్రబాబు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.... దీనికి సంబంధించి జిఓ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విడుదల చేశారు... ఇన్చార్జ్ డీజీపీగా ఉన్న సాంబశివరావు మరో నెల రోజుల్లో రిటైర్ అవనున్నారు... ఇప్పుడు పూర్తి స్థాయి డిజిపిగా నియమించటంతో, ఆయన పదవీ కాలాన్ని కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది... ఈ ఉత్తరువలకు సంబంధించి, కేంద్ర హోం శాఖతో మాట్లాడమని, చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రుల్ని పురమాయించారు... మరి కేంద్రం, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి... ఇక సాంబశివరావు గారి విషయానికి వస్తే, ఆయన సమర్ధవంతమైన ఆఫీసర్ గా పేరుంది...
గతేడాది జూలై నుంచి సాంబశివరావు ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది...