డీజీపీ అంటే, పోలీసు బాస్...ఆయన వస్తున్నారు అంటే, అంతా అలెర్ట్ అవుతారు.. నక్సల్స్, ఉగ్రవాదులు నుంచి ముంపు ఉంటుంది... డీజీపీకి హై సెక్యూరిటీ ఉంటుంది. చీమ కూడా పోలీసు వలయం దాటుకుని, డీజీపీని తాకలేదు. మరో పక్క, మన రాష్ట్రంలో రాజకీయ వైరం మరీ ఎక్కువ. ప్రభుత్వంలో పని చేసే అధికారులకు కూడా వార్నింగ్ లు ఇచ్చే వారు ఉన్నారు. వచ్చిన ప్రతి డీజీపీని, చంద్రబాబు బానిసలు అంటూ విజయసాయి రెడ్డి లాంటి నేతలు బెదిరిస్తారు. తరిమి తరిమి కొడతాం అంటారు. ఇలా అన్ని వైపుల నుంచి, డీజీపీ పై అధిక ఒత్తిడులు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ పరిస్థితి ఇంకా డేంజర్. ఆయన మొన్నటి దాకా ఏసిబీ డీజీ గా, అనేక మంది అవినీతి పరులను జైలుకు పంపారు. ఇలాంటి నేతకు మరింత బధ్రత అవసరం. అందుకే, ప్రభుత్వం, పోలేసు తరుపున, ఆయనకు హై సెక్యూరిటీ ఉంటుంది.
ఈ క్రమంలో, డీజీపీ పర్యటనలు చేసే చోట, ట్రాఫిక్ కూడా ఆపుతున్నారు పోలీసులు. అలాగే ఈ రోజు కూడా చేసారు. గురువారం ఉదయం డీజీపీ వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. డీజీపీ గన్నవరం నుంచి విజయవాడకు వస్తుండగా ట్రాఫిక్ నిలిపివేశారు. విషయం తెలుసుకున్న డీజీపీ ఠాకూర్ తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపవద్దని అధికారులను ఆదేశించారు. తన కోసం ట్రాఫిక్‌ను నిలిపి, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు కూడా డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇదే విషయాన్ని తెలియజేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక్కరికే ఇలా ఆపుతామని, ఆయనకు z+ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, తప్పదని, తనకు కూడా ఆపి, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు అంటూ, స్పష్టమైన ఆదేశాలు అన్ని జిల్లాలకు ఇచ్చారు.
విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు సంగతి తెలిసిందే.. దుర్గ గుడి దగ్గర ఫ్లై-ఓవర్ నిర్మాణంతో అటు వైపు ట్రాఫిక్ కష్టాలు కొంచెం తగ్గే అవకాసం ఉంది. బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లై ఓవర్, బందర్ రోడ్డు విస్తరణ తరువాత, అటు వైపు కూడా ఉపసమనం వచ్చే అవకాసం ఉంది. ఎటు పోయి, ఇప్పుడు సమస్య అంతా రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు. ఈ మార్గం గన్నవరం ఎయిర్ పోర్ట్ వైపు ఉండటం, సిటీ ఎక్కువగా ఇటు వైపు పెరగటం, విద్యా సంస్థలు, ఆఫీసులు ఎక్కువగా రావటంతో, ఈ రోడ్డులో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. సాయంత్రం వేళ నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్ రావటానికి, దాదపుగా 30-45 నిమషాల సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో విఐపి మూమెంట్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఆపేస్తే, ఇక అది నరకమే. అందుకే సియం కాన్వాయ్ కు మినిహా, ఎవరకీ ట్రాఫిక్ ఆపటం లేదు. ఈ రోజు పోలీస్ బాస్ కు ట్రాఫిక్ ఆపతంతో, ఆయన అలా చెయ్యవద్దు, ప్రజలని ఇబ్బంది పెట్టవద్దు అని ఆదేశాలు ఇచ్చారు.