ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ తో, ఆయన విమర్శల పాలు అయ్యారు. ముఖ్యంగా టిడిపి నేతలు, అలాగే సోషల్ మీడియాలో గౌతం సవాంగ్ పై విమర్శల వెల్లువ నడిచింది. అలాగే చింతమనేని ప్రభాకార్, ఎప్పుడూ లేనిది ప్రెస్ మీట్ పెట్టి మరీ, గౌతం సవాంగ్ పై విరుచుకు పడ్డారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన గౌతం సవాంగ్, రాష్ట్రంలో శాంతి భద్రతలు, దిశ చట్టం, ఇలా అనేక అంశాల పై మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన చాలా వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసాయి. ముఖ్యంగా ఆయన మాటిమాటికి ప్రతిపక్ష పార్టీలు అని చెప్పటం అందరినీ ఆశ్చర్య పరిచింది. పోలీసులకు, ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉంటాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు చట్టం, న్యాయం అనేవి మాత్రమే ఉంటాయి కానీ, అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి ఉండవని, అసలు పోలీసులకు ప్రతిపక్షం అని సంబోధించటమే తప్పు అని అంటున్నారు. అలాగే పోలీసుల దగ్గర కొత్త సాఫ్ట్వేర్ ఉందని చెప్తూ, ఏ వ్యక్తి పైన అయిన కేసులు ఉంటే మాకు తెలిసిపోతుంది అంటూ, టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని గురించి ప్రస్తావిస్తూ, ఆయనను ఉదాహరణగా చెప్పారు. దీని పైన కూడా అయన పై విమర్శలు వచ్చాయి. చెప్పేది జగన్ పై ఉన్న 30 కేసులు గురించి చెప్పవచ్చు కదా ని ఎదురు దాడి చేసారు.
ఇక మరో విషయంలో కూడా డీజీపీ విమర్శల పాలు అయ్యారు. నెల్లూరులో ఎంపిడీవో పై అధికార పార్టీ కోటంరెడ్డి చేసిన దా-డి, అలాగే వైరల్ అయిన అంబటి ఆడియో పై, ఆ మహిళ బయటకు వచ్చి ఫిర్యాదు చేయటం, అలాగే వైరల్ అయిన అవంతి ఆడియో పైన, అవంతి వచ్చి ఫిర్యాదు చేయటం పైన, మీ విచారణ ఎంత వరకు వచ్చింది, ఈ మూడు కేసులు గురించి చెప్పండి అని విలేఖరులు అడగగా, వీటి పైన నేను వెంటనే సమాధానం చెప్పలేనని అన్నారు. ఎవరో ఏదో వాయిస్ తో చేసారు, అది కర్రెక్టా కాదా అనేది, నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్తూ, రమ్య కేసు గురించి చెప్తానని, ఈ కేసులో ప్రతిపక్షం రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడింది అంటూ, అసలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అలాగే సీతానగరం ఘటనకు సంబంధించి, ఇప్పటికీ చార్జ్ షీట్ ఎందుకు వేయలేదని, ఎందుకు రెండో నిందితుడని పట్టుకోలేదు అని అడగగా, దానికి కూడా సమాధానం దాట వేసారు. కేవలం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయటం కోసమే, డీజీపీ ప్రెస్ మీట్ పెట్టారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.