ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు సియంగా ఉండగా, విజయవాడ కమీషనర్ గ పని చేసిన గౌతం సవాంగ్, అప్పటి అధికారి పక్షాన్ని కూడా లెక్క చేసే వారు కాదు. చంద్రబాబు అంత స్వేఛ్చ ఇచ్చారు. రాజకీయంగా ఇబ్బంది అయినా, లా అండర్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టటం చంద్రబాబు ధ్యేయం. దానికి తగ్గట్టు గౌతం సవాంగ్ అప్పట్లో బాగా పని చేసారు. తరువాత ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే, డీజీపీ గా ప్రొమోషన్ ఇచ్చారు. అప్పటి నుంచి గౌతం సావాంగ్ గారి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండటం, అనేది ఎక్కడైనా జరిగేదే. కాని దానికి కూడా కొన్ని హద్దులు అనేవి ఉంటాయి కదా. చంద్రబాబు మీద వైసీపీ వాళ్ళు రాళ్లు వేస్తే భావప్రకటనా స్వేఛ్చ అని, అలాగే చంద్రబాబు ఏదైనా లేఖలు రాస్తే, ఆధారాలు ఇవ్వండి ఎంక్వయిరీ చేస్తాం అని చెప్పటం, అలాగే టిడిపి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయటం, ఇవాన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర విమర్శల పాలు అయ్యారు. ఈ క్రమంలోనే, ఆయన డిపార్టుమెంటు పరంగా ఏమైనా మంచి పనులు చేస్తున్నా, అవి ప్రజలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే, ఇప్పుడు డీజీపీ మళ్ళీ రెండు అంశాల్లో వార్తల్లోకి ఎక్కారు. ఒకటి విశాఖ శారదా పీఠం స్వరూపానంద దగ్గరకు యూనిఫారంలో వెళ్లి, ఆయనకు ఎదురుగా కింద కూర్చోవటం వివాదాస్పదం అయ్యింది. ఆయన వెళ్ళాలి అనుకుంటే సివిల్ డ్రెస్ లో వెళ్ళాలి కానీ, ఇలా వెళ్ళటం ఏమిటి అనే విమర్శలు వస్తున్నాయి. ఇక రెండో అంశం, మంత్రి అప్పల రాజు, ఒక సీనియర్ పోలీస్ అధికారులను, బండ బూతులు తిడుతూ, నేట్టివేస్తే, ఆయన పైన ఎలాంటి చర్యలు లేవు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. నిన్న ఒక మీడియా ఛానల్ ప్రతినిధి, అప్పల రాజు కామెంట్స్ పై మీ స్పందన ఏమిటి అంటే, సమాధానం చెప్పకుండా, నవ్వుతూ భుజం తట్టి వెళ్ళిపోయారు. అంటే డీజీపీ పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం అది తప్పు, మంత్రి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పినా, డీజీపీ గారి స్థాయి పెరిగేది. మరీ ఇంతలా డీజీపీ గారు ఎందుకు బెండ్ అయిపోతున్నారు, కనీసం పోలీస్ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం పై కూడా స్పందించే పరిస్థితి లేదు అంటే, రాష్ట్రంలో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.